/rtv/media/media_files/2025/08/06/hyderabad-companies-provide-work-from-home-facility-2025-08-06-09-18-49.jpg)
Hyderabad Companies provide work from home facility
భారత్, అమెరికా ఐటీ ఎప్పటి నుంచో కలిసి పని చేస్తున్నాయి. ఇండియా ఐటీ విలు దాదాపు 300 బిలియన్ డాలర్ల విలువ ఉంటుంది. దీనిపై ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి ట్రంప్ కన్ను పడింది. త్వరలోనే ఐటీలపై ట్సాక్స్ లను విధిస్తామని అన్నారు. అయితే వీటిని కాపాడుకుంటామని చెబుతున్నారు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్. అమెరికాలో ట్రంప్ సర్కారు భారత ఐటీ ఔట్‌సోర్సింగ్ సంస్థలను లక్ష్యంగా చేసుకోవచ్చనే భయాలు వ్యాపిస్తున్న సమయంలో మంత్రి ఈ ప్రకటన చేశారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, ఇతర సర్వీస్ ఆపరేషన్లను భారత్‌లో నిర్వహిస్తున్న అమెరికన్ కంపెనీలతో తాము మాట్లాడుతున్నామని చెప్పారు. అలాగే అమెరికా, ఐరోపా, జపాన్ మిగతా ఆసియా దేశాల ప్రభుత్వాలతోనూ మాట్లాడుతున్నామని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అదే సమయంలో వేలం ఐటీ రంగాలపైనే ఆధారపడకుండా..ఎలక్ట్రానిక్స్, తయారీ రంగాలను ప్రోత్సహించేందుకు వేగంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
భారత్ లో అతి మనీ సోర్స్ ఐటీ..
భారత్ లో ఐటీ రంగం చాలా పెద్దగానే ఉంది. దీని ద్వారా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఎగుమతి ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. భారత ఐటీ సేవల రంగంలో దాదాపు 5.67 మిలియన్ల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే భారత ఐటీ కంపెనీలకు ఐటీ ఔట్ సోర్సింగ్ చేయడంపై ట్రంప్ సర్కార్ ఆంక్షలు విధించొచ్చని చెబుతున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే కాల్ సెంటర్లకు పెద్ద ఎత్తున ముప్పు రావొచ్చును. అలాగే ఐటీ ఎగుమతిపై కూడా భారం పడుతుంది. ఇప్పటికే ఐటీ రంగం చాలా ఎత్తుపల్లాలు చూస్తోంది. ట్రంప్ కనుక ఆంక్షలు విధిస్తే...ఇది మరింత దిగజారుతుంది. మళ్ళీ 2005 లాంటి రెసిషన్ రావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో చాలా మంది ఇప్పటికే ఉద్యోగాలు పోగొట్టుకుని..కొత్తవి రాక నానా పాట్లు పడుతున్నారు. రెసిషన్ కనుక వస్తే మరిన్ని ఉద్యోగాలు పోతాయి. దాంతో పాటూ కొత్త ఉద్యోగాలు అస్సలు రావు. దీని కారణంగా అమెరికాలో ఉంటున్న చాలా మంది భారతీయ టెకీలు తిరిగి ఇండియాకు వచ్చేయాల్సి ఉంటుంది.
ఐటీ రంగంపై ట్రంప్ టారిఫ్ లను విధిస్తే..భారత టెక్ కంపెనీలకు ఇబ్బందులు తప్పవు. ఇప్పటికీ మన కంపెనీలు వారికి భారీ సుంకాలు చెల్లిస్తున్నాయి. దీనికి అదనంగా టారిఫ్‌లు విధిస్తే.. రెండుసార్లు పన్నుపోటు బారిన పడినట్లవుతుంది. దాంతో పాటూ ఔట్ సోర్సింగ్ మరింత కాస్ట్లీ అయిపోతుంది. భారత్ ఔట్‌సోర్సింగ్ రంగం విలువ 283 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది. దీనిలో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో వంటి సంస్థలు ఉన్నాయి. వీటి ఆదాయాల్లో 60 శాతం వరకు అమెరికా నుంచే లభిస్తోంది. అయితే మిగతా వాటి మీద అదనపు టారిఫ్ లను విధించినట్టు ఐటీ మీద విధించలేరని చెబుతున్నారు. ఈ రంగంలో సీఈఓలు చాలా మంది ట్రంప్ కు సన్నిహితంగా ఉంటున్నారు. అదీకాక చాలా కంపెనీలు అమెరికా, భారత్ రెండిటితోనూ టై అయి ఉన్నాయి. సుంకాలు భారత టెక్ కంపెనీలను ప్రభావితం చేస్తే..అమెరికా కంపెనీల మీద కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది. ఇది వారికి కూడా నష్టమే. దాంతో పాటూ అమెరికాలో కన్నా భారత్ లోనే టెక్ నిపుణులు చాలా ఎక్కువ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు మంచి స్థితిలో ఉండాలంటే.. భారత్ నుంచి నిపుణులను నియమించుకోవాల్సి ఉంటుంది. వారిని హెచ్1బీ వీసాలతో అమెరికాకు రప్పించి లేదా.. రిమోట్ విధానంలో అయిన పనిచేయించుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.