/rtv/media/media_files/2025/09/07/venice-film-festival-2025-2025-09-07-18-49-29.jpg)
Venice Film Festival 2025
Anuparna Roy : వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో అనుపర్ణ రాయ్ రికార్డు సృష్టించారు. ఒరిజోంటి కేటగిరీలో అవార్డు గెలిచిన తొలి భారతీయ దర్శకురాలిగా నిలిచారు. ఆమె చిత్రం 'సాంగ్స్ ఆఫ్ ఫర్‌గాటెన్ ట్రీస్'కి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. ఇది ఆమె తొలి సినిమా కావడం విశేషం. అలాగే ఒరిజోంటి సెక్షన్‌లో భారత్ నుంచి ఎంట్రీగా పంపిన ఏకైక చిత్రంగా నిలిచింది.1949 నుంచి ఫెస్టివల్‌లో గోల్డెన్ లయన్ అవార్డులు ప్రకటించబడుతున్నప్పటికీ, కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు 20 సంవత్సరాల క్రితం ఒరిజోంటి అవార్డు ప్రవేశపెట్టారు. ఈ అవార్డును ఓరిజాంటి జ్యూరీ అధ్యక్షురాలిగా ఉన్న ఫ్రెంచ్ డైరెక్టర్ జూలియా డుకోర్నావు.. అనుపర్ణకు అవార్డు ప్రదానం చేశారు.ఈ సంవత్సరం ఫెస్టివల్ ఆగస్టు 27న ప్రారంభమై సెప్టెంబరు 6న ముగిసింది, కాగా హాలీవుడ్ మూవీ 'ఫాదర్ మదర్ సిస్టర్ మదర్' ఉత్తమ చిత్రంగా గోల్డెన్ లయన్ అవార్డును సాధించింది.
Anuparna Roy’s debut Songs of Forgotten Trees, backed by Anurag Kashyap, received a standing ovation at its world premiere at the 82nd Venice Film Festival.https://t.co/bByNtQUOEe#VeniceFilmFestival#IndianCinema#AnuparnaRoy#AnuragKashyap#SongsOfForgottenTrees… pic.twitter.com/rBhgdOxdFX
— DNN24 (@Dnn24Network) September 3, 2025
ఈ సందర్భంగా అనుపర్ణరాయ్ మాట్లాడుతూ "తొలి సినిమాతోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు.
ఇలాంటి కథలను తీసుకుని సినిమాలు రూపొందించేందుకు ఈ అవార్డు ప్రేరణగా ఉంటుందని చెప్పారు. పాలస్తీనాలోని చిన్నారుల దారుణ పరిస్థితులపై ఆమె వ్యాఖ్యానిస్తూ, చిన్నారులకు శాంతి, స్వేచ్ఛ అందించాల్సిన అవసరం ఉందని, దానికి పాలస్తీనా చిన్నారులు మినహాయింపు కాకూడదని అభిప్రాయపడ్డారు.
#BiennaleCinema2025#Venezia82#Orizzonti⁰Premio Orizzonti per la migliore regia / Orizzonti Award for Best Director:⁰#AnuparnaRoy per/for SONGS OF FORGOTTEN TREES pic.twitter.com/L7ZMJ7Jv10
— La Biennale di Venezia (@la_Biennale) September 6, 2025
అనుపర్ణ 2023లో షార్ట్‌ఫిల్మ్ 'రన్ టు ది రివర్' తో అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్ ను ప్రారంభించారు. ఆ లఘు చిత్రానికి పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రశంసలు దక్కాయి.ముంబయిలో ఉద్యోగం చేస్తూ 'సాంగ్స్ ఆఫ్ ఫర్‌గాటెన్ ట్రీస్' రూపొందించారు. ఈ సినిమా ముంబయికి వలస వెళ్లిన ఇద్దరు మహిళలు ఎదుర్కొన్న సవాళ్లను, సమస్యలను ప్రస్తావిస్తుంది. ఒంటరితనం, జీవనోపాధి, క్షణిక సంబంధాల థీమ్‌లతో ఈ సినిమా రూపొందించారు అనుపర్ణ.ఈ విధంగా అనుపర్ణ రాయ్ వయసులోనూ, తొలి సినిమాతోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రముఖ భారతీయ దర్శకురాలిగా నిలిచారు.
‘Songs Of Forgotten Trees’ director Anuparna Roy speaks out for Palestine during her acceptance speech for Best Director in the Horizons section of the #VeniceFilmFestival: “I might upset my country but it doesn’t matter to me anymore” pic.twitter.com/HrSZEI0wCO
— Deadline (@DEADLINE) September 6, 2025