Royal Challengers Bengaluru : అమ్మకానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. అంతా సిద్ధం!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పురుషుల, మహిళల జట్ల ప్రస్తుత యజమాని అయిన బ్రిటన్ మద్యం దిగ్గజ సంస్థ డియాజియో (Diageo), ఈ ఫ్రాంచైజీని విక్రయించే ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది.

New Update
rcb

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలోనే అతిపెద్ద యజమాన్య మార్పులలో ఒకటిగా నిలిచే అవకాశం ఉన్న కీలక పరిణామం చోటు చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పురుషుల, మహిళల జట్ల ప్రస్తుత యజమాని అయిన బ్రిటన్ మద్యం దిగ్గజ సంస్థ డియాజియో (Diageo), ఈ ఫ్రాంచైజీని విక్రయించే ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. డియాజియోకు చెందిన భారత అనుబంధ సంస్థ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (USL), బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)కి అధికారికంగా ఈ విషయాన్ని తెలియజేసింది.

రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (RCSPL) లోని తమ పెట్టుబడిపై వ్యూహాత్మక సమీక్ష చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. దీని అర్థం, క్రికెట్ ఫ్రాంచైజీ వ్యాపారం తమ ప్రధాన వ్యాపారం అయిన మద్యం  కేటగిరీకి చెందింది కాదని డియాజియో స్పష్టం చేసింది.ఈ అమ్మకం ప్రక్రియను 2026 మార్చి 31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డియాజియో అధికారిక ప్రకటనలో తెలిపింది. నివేదికల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమాన గణం, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ వంటి ప్రముఖులు ఉండటంతో, ఈ ఫ్రాంచైజీ విలువ 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.16,800 కోట్లు) వరకు ఉండవచ్చని అంచనా.

కార్పొరేట్ సంస్థలు ఆసక్తి

ఫ్రాంచైజీ అమ్మకం వార్త వెలువడగానే, అనేక కార్పొరేట్ సంస్థలు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈఓ అదార్ పూనావాలా, జేఎస్‌డబ్ల్యూ (JSW) గ్రూప్ వంటి ప్రముఖ సంస్థల పేర్లు కొనుగోలుదారుల రేసులో ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఐపీఎల్ వ్యవస్థాపక జట్లలో ఒకటైన ఆర్‌సీబీ.. మొదట విజయ్ మాల్యా ఆధీనంలో ఉండేది. ఆయన ఆర్థిక ఇబ్బందుల కారణంగా, 2012లో డియాజియో సంస్థ ఆర్‌సీబీ యాజమాన్యాన్ని దక్కించుకుంది. ఇప్పుడు డియాజియో నిర్ణయంతో, ఆర్‌సీబీ యాజమాన్యంలో మరో అతిపెద్ద మార్పు జరగబోతోంది.

Advertisment
తాజా కథనాలు