/rtv/media/media_files/2025/10/23/indigo-flight-from-kolkata-to-srinagar-made-an-emergency-landing-2025-10-23-07-26-56.jpg)
indigo flight from kolkata to srinagar made an emergency landing
భారతదేశంలో విమాన ప్రయాణాలు వరుస సాంకేతిక సమస్యల (Technical Glitches) కారణంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా దేశీయ విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో తరచూ లోపాలు తలెత్తుతుండటం ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళన రేకెత్తిస్తోంది. గత కొన్ని వారాలుగా టేకాఫ్‌కు ముందు ఇంజిన్ సమస్యలు, గాలిలో ఉండగా సాంకేతిక లోపాలు, ల్యాండింగ్ సమయంలో ఎదురైన ఇబ్బందుల కారణంగా పలు విమానాలు ఆలస్యం కావడం లేదా అత్యవసరంగా మళ్లించడం/రద్దు చేయడం జరుగుతోంది.
indigo flight emergency landing
Kolkata to Srinagar IndiGo 6E6961 flight made a priority landing in Varanasi following fuel issues. The flight has 166 passengers: Airport Authority
— ANI (@ANI) October 22, 2025
More details awaited.
ఇటీవలే ముంబై నుంచి న్యూయార్క్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తడంతో దానిని ముంబై విమానాశ్రయంలోనే అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. తాజాగా అలాంటిదే మరొక ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఇంధన లీకేజీ సమస్య కారణంగా మరో ఇండిగో విమానాన్ని వారణాసిలో అత్యవసరంగా దించాల్సి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కోల్‌కతా నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం 6E-6961 బుధవారం (అక్టోబర్ 22) ఇంధన లీకేజీ సమస్య కారణంగా ఉత్తరప్రదేశ్ వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో అప్పటికి సిబ్బందితో సహా మొత్తం 166 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇంధన ట్యాంక్ నుంచి ఇంధనం లీక్ అవుతున్నట్లు గుర్తించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే వారణాసి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి సమాచారం అందించారు. అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరగా, ఏటీసీ అందుకు ఆమోదం తెలిపింది.
దీంతో సాంకేతిక సమస్య నేపథ్యంలో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సాయంత్రం 4:10 గంటలకు సురక్షితంగా రన్‌వేపై దించారు. వారణాసి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విమానంలోని 166 మంది ప్రయాణికులను, సిబ్బందిని సురక్షితంగా కిందకు దించి, ఎరైవల్ ఏరియాలో వేరే విమానం ఏర్పాటు చేసే వరకు సురక్షితంగా ఉంచారు.
గోమతి జోన్ పోలీసుల ప్రకటన ప్రకారం.. విమానంలో ఫ్యూయల్ లీకేజీ ఫిర్యాదు అందిన వెంటనే అత్యవసర ల్యాండింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సాంకేతిక నిపుణుల బృందం విమానాన్ని పరిశీలించి, మరమ్మతులు చేస్తోంది. సాంకేతిక సమస్య పరిష్కారమైన తర్వాత విమానం తన గమ్యస్థానానికి బయలుదేరుతుందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విమానాశ్రయ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం విమానాశ్రయంలో సాధారణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
Follow Us