/rtv/media/media_files/2025/01/04/cc9v2ayKWIeEwaYCipxg.jpg)
Dmart
డీమార్ట్(dmart) గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎక్కువగా పట్టణాల్లో డీమార్ట్‌లు ఉన్నాయి. వీటిలో ప్రతీ వస్తువుపై డిస్కౌంట్ ఉంటుంది. తక్కువ ధరలకు అన్ని వస్తువులు లభించడంతో మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా డీమార్ట్‌లో అన్ని వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. అయితే డీమార్ట్‌లో చాలా వస్తువులు తక్కువ ధరకి లేదా సగం ధరకు లభిస్తాయి. ఇందులో అన్ని రకాల కంపెనీల ప్రొడక్ట్స్ ఉంటాయి. కొన్నింటికి మాత్రం డీమార్ట్ ప్యాకింగ్ ఉంటుంది. అయితే వినియోగదారులకు డీమార్ట్ గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. ముఖ్యంగా చిన్న వ్యాపారులు కూడా డీమార్ట్‌తో కలిసి వ్యాపారం చేసుకోవచ్చని తెలిపింది. చిన్న వ్యాపారులు వారి వస్తువులను డీమార్ట్‌లో విక్రయించడానికి అనుమతి ఇస్తోంది. దీనివల్ల తమ బ్రాండ్‌ను వ్యాపారులు అభివృద్ధి చేసుకుని, మంచి లాభాలు పొందవచ్చు. అయితే ఎలా మీ ప్రొడక్ట్స్ డీమార్ట్(Dmart Business Opportunity) లో అమ్ముకోవచ్చో మీకు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఇది కూడా చూడండి: India GDP Growth Q1 2025-26: భారత ఆర్థిక వ్యవస్థ అద్భుత ప్రదర్శన.. తొలి త్రైమాసికంలో 7.8% వృద్ధి
Dmart Business Opportunity
డీమార్ట్‌లో అన్ని రకాల వస్తువులు ఉంటాయి. ఉదాహరణకు ఫుడ్ ఐటెమ్స్, కిరాణ సరుకులు, ఇంటికి కావాల్సిన వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు, దుస్తులు, స్టీల్ సామానులు ఇలా అన్ని రకాల వంటివి అమ్ముతుంటారు. అయితే డీమార్ట్‌లో మీ వస్తువులు అమ్ముకోవాలని అనుకుంటే వ్యాపారస్తులు ముందుగా డీమార్ట్ అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి. అందులో మీ కంపెనీ వివరాలతో పాటు డీమార్ట్‌లో ఏయే వస్తువులను అమ్మాలని అనుకుంటున్నారని తెలియజేయాలి. అన్ని వివరాలు పూర్తి చేసి వ్యాపారులు దరఖాస్తు చేసుకోవాలి. వీరిని డీమార్ట్ అధికారులు సంప్రదిస్తారు. ప్రతీ మంగళవారం డీమార్ట్ అధికారులు ఈ వ్యాపారులతో సమావేశం అవుతారు.
ఇది కూడా చూడండి: Reliance Jio IPO: త్వరలో వచ్చేస్తున్న జియో ఐపీఓ.. మెటాతో కలిసి సరికొత్త ఏఐ కంపెనీ !
ఇందులో వస్తువులు నాణ్యంగా ఉన్నాయా? లేదా? ధర వివరాలు అన్ని కూడా మాట్లాడుకుంటారు. ఇద్దరికీ ఒప్పందం కుదిరితే మీ వస్తువులను డీమార్ట్‌లో పెట్టడానికి అంగీకరిస్తారు. డీమార్ట్‌లో వ్యాపారులు వారి వస్తువులను పెట్టడం వల్ల బ్రాండ్ విలువ పెరుగుతుంది. డీమార్ట్ ద్వారా మీ వస్తువులు చాలా మందికి తెలుస్తాయి. అయితే ధర ఎక్కువగా కాకుండా తక్కువ ధరకే నాణ్యమైన వస్తువులను తయారు చేసి ఇవ్వాలి. బయట మార్కెట్ కంటే మీ దగ్గర లో కాస్ట్ విత్ క్వాలిటీ ఉంటే ఎక్కువ మంది వినియోగదారులు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కొందరు డీమార్ట్‌తో రిటైల్ చైన్‌తో కలిసి పనిచేస్తే ఎక్కువ మంది వినియోగదారులకు మీ వస్తువులు చేరుతాయి. దీనివల్ల లాభాలు కూడా ఎక్కువగా వస్తాయి. అలాగే డీమార్ట్ ఎప్పుడు ఫ్రాంచైజీలను ఇవ్వదు. కొందరు ఈ ఫ్రాంచైజీల పేరుతో మోస పోతుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.