Reliance Jio IPO: త్వరలో వచ్చేస్తున్న జియో ఐపీఓ.. మెటాతో కలిసి సరికొత్త ఏఐ కంపెనీ !

రిలయన్స్ జియో వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఐపీఓకి రానున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ తెలిపారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ముకేష్ అంబానీ తెలిపారు.

New Update
Jio IPO

Jio IPO

రిలయన్స్ జియో(reliance-jio) వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఐపీఓ(jio IPO) కి రానున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ(Mukesh Ambani) తెలిపారు. జియో ఐపీఓకి వస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయాన్ని ముకేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించారు. ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా ఉండేలా చూస్తున్నట్లు తెలిపారు. అయితే 2027 కల్లా ఎబిటాను కొన్ని లక్షల కోట్ల నుంచి రెట్టింపు చేస్తామన్నారు. రూ.55 వేల కోట్లతో వచ్చే ఏడాది ప్రథమార్థంలో రాబోతున్న రిలయన్స్ జియో ఐపీఓకి ఎప్పుడు వస్తుందనే విషయాన్ని ప్రకటించలేదు.

ఇది కూడా చూడండి: Stock Market: వారం చివరి రోజున లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి జియో

రిలయన్స్ జియో ఐపీఓకి లిస్టింగ్ కావడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) రంగంలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ముకేష్ అంబానీ తెలిపారు. ప్రతీ చోటా, ప్రతి ఒక్కరి కోసం ఏఐ అనే నినాదంతో జియో ఆర్టిఫిషియల్ రంగంలోకి కూడా వస్తుందని అన్నారు. భారత్‌తో తర్వాత తరానికి ఏఐ మౌలిక వసతులు, ఏఐ సేవలు, ఏఐ నిపుణులను అందించడాని కోసమే రిలయన్స్ ఏఐని తీసుకొస్తుందని తెలిపారు. ఆర్‌ఐఎల్ మెటాతో  కలిసి రూ.855 కోట్ల పెట్టుబడులతో ఏఐ సంయుక్త సంస్థను కూడా ఏర్పాటు చేయనున్నారు.  రిలయన్స్ సంస్థ వ్యాపారైన ఇంధనం, రిటైల్, టెలికాం, మీడియా, మాన్యుఫ్యాక్చరింగ్ విభాగాల్లో ఓపెన్ ఏఐ మోడల్స్, ఏఐ టూల్స్ తో అనుసంధానం జరుపుతానని తెలిపారు. అలాగే వీటిని అభివృద్ధి చేయడానికి మెటాతో  పాటు గూగుల్ సేవలు కూడా వినియోగించనుకోనున్నట్లు ముకేష్ అంబానీ వెల్లడించారు. 

జియో పీసీ

జియో ఐపీఓతో పాటు ఏఐ, జియో పీసీ(JIO PC) కోసం ఆకాష్ అంబానీ మాట్లాడారు. ఈ జియో పీసీ అనేది ఇంట్లో ఉన్న టీవీ లేదా ఇంకా ఏదైనా స్క్రీన్‌ను పూర్తిగా ఏఐ రెడీ కంప్యూటర్‌గా మార్చే ఫీచర్ అని తెలిపారు. దీనిపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయని త్వరలోనే జియో పీసీ రాబోతుంందని వెల్లడించారు.

ఇది కూడా చూడండి: India GDP Growth Q1 2025-26: భారత ఆర్థిక వ్యవస్థ అద్భుత ప్రదర్శన.. తొలి త్రైమాసికంలో 7.8% వృద్ధి

Advertisment
తాజా కథనాలు