Masood Azhar: ఆపరేషన్‌ సిందూర్‌లో ముక్కలైన మసూద్‌ అజార్‌ కుటుంబం.. వీడియో

ఆపరేషన్ సిందూర్ దాడుల్లో జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌ కుటుంబంలో కొందరు మృతి చెందినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జైషే మహ్మద్‌ కమాండర్ మసూద్‌ ఇలియాస్‌ కశ్మీరీ ఈ విషయాన్ని అంగీకరించారు.

New Update
Masood Azhar's family 'torn into pieces' by India, Jaish admits Op Sindoor impact

Masood Azhar's family 'torn into pieces' by India, Jaish admits Op Sindoor impact

పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) అనంతరం ఆపరేషన్ సిందూర్‌(Operation Sindoor) పేరుతో భారత సైన్యం పాక్ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడుల్లో జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌ కుటుంబంలో కొందరు మృతి చెందినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జైషే మహ్మద్‌ కమాండర్ మసూద్‌ ఇలియాస్‌ కశ్మీరీ ఈ విషయాన్ని అంగీకరించారు. ఆపరేషన్ సిందూర్‌లో ఆ ఉగ్రసంస్థ చీఫ్‌ మసూద్‌ అజార్‌ కుటుంబం ముక్కలైనట్లు వ్యాఖ్యనించారు. తాజాగా పాకిస్థాన్‌లో జరిగిన ఓ మీటింగ్‌లో అతడు మాట్లాడాడు.  

Also Read: ఓరి కామాంధుల్లారా.. 16 ఏళ్ల బాలుడిపై 14 మంది యువకులు రేప్.. తల్లి చూడటంతో..!

Masood Azhar's Family Turn Into Pieces

ఆ వీడియోలో జైషే కమాండర్ మసూద్ ఇలియాస్‌ మాట్లాడుతూ.. భారత బలగాలు తమ రహస్య స్థావరంలోకి చొరబడి వాళ్లపై ఎలా దాడులు చేశారో చెప్పాడు. '' ఉగ్రవాదాన్ని స్వీకరించాక,, మేము దేశ సరిహద్దులు కాపాడేందుకు మేము ఢిల్లీ, కాబూల్‌, కాందహార్‌లతో పోరాటం చేశాం. పూర్తిగా త్యాగం చేశాం. మే 7న బహవల్‌పూర్‌లో భారత బలగాలు మౌలానా  మసూద్‌ అజార్ కుటుంబాన్ని ముక్కలు చేశాయంటూ'' రెచ్చగొట్టేలా మాట్లాడాడు.  

ఆపరేషన్ సిందూర్‌లో జైషే చీఫ్ మసూద్ అజార్‌(Masood Azar) ఫ్యామిలీలో 10 మందితో పాటు అతడికి చెందిన మరో నలుగురు అనుచరులు మృతి చెందారు. వాళ్లతో సహా జైషే నెంబర్‌ 2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్‌ రవూఫ్‌ అస్గర్‌ అళాగే మౌలామా అమర్‌, ఇతర కుటుంబ సభ్యులు కూడా మృతి చెందినట్లు తెలిసింది. దాదాపు 600 మంది ఉగ్రవాదాలు ఇళ్లు ఈ ఉగ్రస్థావలా 

 దాదాపు 600 మంది ఉగ్రవాదుల ఇళ్లు కూడా ఈ క్యాంపస్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆపరేషన్‌ సిందూర్‌ దెబ్బకు బహవల్‌పూర్‌లోని జైషే ఉగ్రస్థావరాలు చిన్నాభిన్నమయ్యాయి. వాటిని పునర్‌నిర్మించుకునేందుకు పాక్‌ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారీ ఎత్తున నిధులు కూడా కేటాయించింది.

Also Read: దసరా గిఫ్ట్.. భారీగా తగ్గనున్న పాల ధరలు.. లీటరకు ఎంతంటే?

ఇదిలాఉండగా జమ్మూకశ్మీర్‌(Jammu & Kashmir) లో ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసారన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రకాల్పుల్లో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత పాక్‌పై ప్రతీకారంతో భారత్‌ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. లష్కరే చోయిబా(lashkar-e-taiba), జైషే మహ్మద్‌ లాంటి ఉగ్రముఠాలే టార్గెట్‌గా వాటి స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ముఖ్యంగా బహవల్‌పూర్‌లోని జైషే ప్రధాన కేంద్రాన్ని కుప్పకూల్చింది.  

Advertisment
తాజా కథనాలు