Milk Prices: దసరా గిఫ్ట్.. భారీగా తగ్గనున్న పాల ధరలు.. లీటరకు ఎంతంటే?

మదర్ డెయిరీ తమ పాలఉత్పత్తుల ధరలను తగ్గించింది. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తర్వాత పాలు, నెయ్యి, పన్నీర్ ధరలు తగ్గాయి. తగ్గించిన GST ప్రయోజనాలను వినియోగదారులకు పూర్తిగా అందిస్తున్నట్లు మదర్ డెయిరీ తెలిపింది. కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుండి అమలులోకి వస్తాయి.

New Update
Mother Dairy Reduces Prices as GST Benefits Passed to Consumers

Mother Dairy Reduces Prices as GST Benefits Passed to Consumers

దసరా, దీపావలి పండుగకు ముందు మోడీ సర్కార్ ప్రజలకు అదిరిపోయే సర్‌ప్రైజ్ అందించింది. ఇటీవల 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో.. సామాన్య ప్రజలకు అనేక వస్తువులపై జీఎస్టీ తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ తగ్గించిన కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఇందులో సామాన్య ప్రజలకు అవసరమైన నిత్యవసర వస్తువులపై అధికంగా జీఎస్టీ తగ్గించినట్లు తెలుస్తోంది. 

Mother Dairy Reduces Prices

ఈ తరుణంలో మదర్ డెయిరీ తన కస్టమర్లకు అదిరిపోయే సర్‌ప్రైజ్ అందించింది. తమ పాల ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నట్లు తెలిపింది. అంటే పాల నుంచి నెయ్యి వరకు అనేక ఉత్పత్తులపై ప్రభుత్వం GSTలో మార్పులకు అనుగుణంగా ధరల తగ్గింపును ప్రకటించింది. మదర్ డెయిరీ తన పాల ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల ధరలను తగ్గిస్తున్నట్లు తెలిపింది. 

బటర్, చీజ్, నెయ్యి, ఫ్రోజెన్ కూరగాయలు, ప్యాక్ చేసిన జ్యూస్‌లు, రెడీ-టు-కుక్, పాలు, పన్నీర్, మిల్క్ షేక్స్ వంటి ఉత్పత్తుల ధరలను తగ్గించనుంది. దీంతో ఈ వస్తువులు ఇప్పుడు ప్రజలకు చౌకగా లభిస్తాయి. ఇకపై ప్యాకేజ్ సైజ్ బట్టి 2రూపాయల నుంచి గరిష్ఠంగా 30రూపాయల వరకు ధరలు తగ్గనున్నాయి. కాగా ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు సౌలభ్యం కోసం ప్యాక్ చేసిన వస్తువుల వాడకాన్ని పెంచుతున్నారు. అందువల్ల ఈ ధరల తగ్గింపు వారికి ఉపశమనం కలిగిస్తుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. 

దీనిపై మదర్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ బాండ్లిష్ మాట్లాడుతూ.. కొత్త GST రేట్లు సెప్టెంబర్ 22 నుండి అమలులోకి వస్తాయని తెలిపారు. దుకాణాలలో ఈ మార్పు కనిపిస్తుందని అన్నారు. అంతేకాకుండా వినియోగదారులకు చౌకగా, మంచి నాణ్యత గల ఉత్పత్తులను అందించడమే తమ కంపెనీ ముఖ్య లక్ష్యమని తెలిపారు. జీఎస్టీ తగ్గింపు వల్ల వినియోగదారులకు ప్రయోజనం చేకూరడమే కాకుండా, ప్యాకేజ్డ్ ఫుడ్‌కు డిమాండ్ కూడా పెరుగుతుందని అన్నారు. పన్ను ఉపశమనం పూర్తి ప్రయోజనం ప్రజలకు నేరుగా చేరాలనేది కంపెనీ లక్ష్యం అని తెలిపారు. 
Advertisment
తాజా కథనాలు