Rishi Sunak: రిషి సునాక్‌ను హత్య చేస్తామంటూ బెదిరింపులు.. కోర్టు సంచలన తీర్పు

బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్‌కు జాత్యాహంకార హత్యా బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఆయన్ని బెదిరించిన 21 ఏళ్ల యువకుడికి అక్కడి స్థానిక కోర్టు జైలు శిక్ష విధించింది. ప్రస్తుత రోజుల్లో ఇలాంటి వివక్షతకు తావు లేదని పేర్కొంది

New Update
former British PM Rishi Sunak

former British PM Rishi Sunak

బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్‌కు జాత్యాహంకార హత్యా బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఆయన్ని బెదిరించిన 21 ఏళ్ల యువకుడికి అక్కడి స్థానిక కోర్టు జైలు శిక్ష విధించింది. ప్రస్తుత రోజుల్లో ఇలాంటి వివక్షతకు తావు లేదని పేర్కొంది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ చెప్పిన వివరాల ప్రకారం.. బర్కన్‌ హెడ్‌కు చెందిన లియామ్ షా అనే యువకుడు 2024 జూన్‌లో రిషి సునాక్‌కు రెండు ఈమెయిళ్లు పంపాడు. 

Also Read: 'నా భార్య బాధపడింది'.. వారానికి 90 గంటల పనిపై వెనక్కి తగ్గిన L&T సీఎండీ

అందులో జాత్యాహంకార హత్యా బెదిరింపులు చేశాడు. ఆ సమయంలో రిషి సునాక్‌ బ్రిటన్ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన వ్యక్తిగత సహాయకుడు వాటిని గుర్తించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన పోలీసులు సెప్టెంబర్‌లో నిందితుడిని అరెస్టు చేశారు. అతడిని విచారణ చేయగా పోలీసులకు మరో షాక్ ఇచ్చాడు. అసలు తనకు ఈమెయిళ్లు పంపిన విషయమే గుర్తులేదని.. ఆ సమయంలో తాను మద్యం మత్తులో ఉన్నానని చెప్పాడు. దీనిపై విచారణ అలా సాగుతూనే ఉంది.

Also Read: మీరు మారరారా ?.. భారతీయ యువతులపై పాకిస్థానీయుల చిల్లర చేష్టలు

అయితే ఏడాది జులైలో అతడు కోర్టు ముందు హాజరయ్యాడు. తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. దీంతో కోర్టు అతడికి గత బుధవారం 14 వారాల జైలుశిక్ష విధించింది. అంతేకాదు 20 రోజుల పాటు పునరావాస కేంద్రంలో ఉంచాలని, మాదక ద్రవ్యాల రిహాబిలిటేషన్ కోర్సును కూడా పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే రెండేళ్ల పాటు రిషి సునాక్‌కు, ఆయన ఆఫీసుకు దూరంగా ఉండాలని తేల్చిచెప్పింది. ప్రజాప్రతినిధితో నేరుగా సంప్రదించే సౌకర్యం ప్రజాస్వామ్యానికి మూలస్తంభంని కోర్టు అభిప్రాయపడింది. అలాంటి సౌకర్యాన్ని దుర్వినియోగం చేయడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియకు హాని కలిగిస్తుదంని స్పష్టం చేసింది. అలాగే నిందితుడికి జైలు శిక్ష అమలును ఏడాది కాలానికి నిలిపివేస్తూ తీర్పునిచ్చింది. 

Also Read: మళ్ళీ హాట్ టాపిక్ అయిన జెలెన్ స్కీ డ్రెస్..రిపోర్టర్ కు కౌంటర్ ఇచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు

ఇదిలాఉండగా గతేడాది రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్‌ పార్టీ బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. విపక్ష లేబర్ పార్టీ విజయం విజయం సాధించింది. లేబర్‌ పార్టీ నేత కీర్‌ స్టార్మర్‌ యూకే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. గత 14 ఏళ్లు అధికారంలో ఉన్న కన్జర్వేటీవ్‌ పార్టీ ఈసారి మాత్రం ప్రజల్లో తమ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఆర్థిక సంక్షోభం నెలకొనడం, పార్టీలో అంతర్గత సమస్యల వల్ల ప్రజా వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. రిషి సునాక్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్ని తప్పులు కూడా చేశారంటూ రాజకీయ నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే రిషి సునాక్ తన పార్లమెంట్ నియోజకవర్గమైన రిచ్‌మండ్ అండ్ నార్తాలెర్టన నుండి గెలుపొందారు. 

Also Read: పుతిన్ సమావేశానికి హాడావుడి..నీరసంగా జెలెన్ స్కీ భేటీ.. ట్రంప్ తీరు

Advertisment
తాజా కథనాలు