'నా భార్య బాధపడింది'.. వారానికి 90 గంటల పనిపై వెనక్కి తగ్గిన L&T సీఎండీ

ఎల్ అండ్ టీ సీఎండీ ఎస్. ఎన్ సుబ్రహ్మణ్యన్ ఇటీవల వారానికి 90 గంటలు పనిచేయాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.తాజాగా సుబ్రహ్మణ్యన్ ఈ విషయం గురించి మాట్లాడారు. గతంలో పనిగంటలపై చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు.

New Update
L&T Chairman SN Subrahmanyan

L&T Chairman SN Subrahmanyan


ఎల్ అండ్ టీ సీఎండీ ఎస్. ఎన్ సుబ్రహ్మణ్యన్ ఇటీవల వారానికి 90 గంటలు పనిచేయాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆదివారం సెలవు కూడా వదిలేసి పనిచేయాలని.. భార్యను ఎంతసేపు చూస్తూ ఉండిపోతారని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పలువురు వ్యాపారవేత్తలు, ప్రముఖులు కూడా ఆయన వ్యాఖ్యలను ఖండించారు. అయితే తాజాగా సుబ్రహ్మణ్యన్ ఈ విషయం గురించి మాట్లాడారు. గతంలో పనిగంటలపై చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. భార్యను ఎంతసేపు చూస్తుంటారని అన్నందుకు తన భార్య కూడా బాధ పడినట్లు పేర్కొన్నారు.  

ఇప్పటినుంచి అలాంటి విషయంలో జాగ్రత్తగా మాట్లాడుతానన్నారు. ఆ సమయంలో కంపెనీకి సంబంధించి కీలక ప్రాజెక్టుల్లో ఆలస్యం జరుగుతున్నట్లు నాకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. అందుకే అలా మాట్లాడాల్సి వచ్చిందని.. కావాలని ఆ వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. '' గతంలో పని గంటల గురించి నేను మాట్లాడినప్పుడు కంపెనీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. కొన్ని కీలకమైన ప్రాజెక్టుల్లో ఆలస్యం జరుగుతున్నట్లు కొందరు క్లయింట్లు నాకు పర్సనల్‌గా ఫిర్యాదులు చేశారు. ఆ సమయంలో నేను ఆందోళనలో ఉన్నాను. అందుకే అలా మాట్లాడాను. పరిస్థితులు వేరేలా ఉంటే నేను మరోలా మాట్లాడేవాడిని. ఎంతసేపు అలా భార్యను చూస్తు ఉంటారు అన్న మాటలకు నా భర్య కూడా బాధపడిందని'' సుబ్రహ్మణ్యన్ తెలిపారు. 

Also Read: మీరు మారరారా ?.. భారతీయ యువతులపై పాకిస్థానీయుల చిల్లర చేష్టలు

ఇదిలాఉండగా గతంలో సుబ్రహ్మణ్యన్ వారానికి 90 గంటలు పనిచేయాలని అనడం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ '' ఆదివారాలు మీతో పని చేయించనందుకు చింతిస్తున్నాం. మిమ్మల్ని ఆరోజు కూడా పనిచేయిస్తే నేను సంతోషంగా భావిస్తాను. నేను కూడా ఆదివారాలు పనిచేస్తాను. ఇంట్లో ఉండి ఏం చేస్తారు. భార్యను ఎంతసేపు అలా చూస్తుంటారు. ఇంట్లో మీరు తక్కువ సమయం, ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటానని భార్యలకు చెప్పాలని'' వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Also Read: 6వేలకు పైగా విదేశీ విద్యార్ధుల వీసాలు రద్దు చేసిన అమెరికా.. ఎందుకంటే?

ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందించారు. బాలీవుడ్ నటి దీపికా పదుకునే కూడా దీనిపై స్పందించారు. ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం ఆశ్చర్యం అంటూ అన్నారు. ప్రముఖ పారిశ్రారమిక వేత్త హర్ష్ గోయోంకా కూడా సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలను ఖండించారు. ఉద్యోగులు బానిసలుగా కష్టపడకుండా తెలివగా పనిచేయడాన్ని విశ్వసిస్తానని తెలిపారు. మరో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా కూడా దీనిపై స్పందించారు. ఎన్ని గంటలు పని అన్నది ముఖ్యం కాదని.. పనిలో నాణ్యతను మాత్రమే చూడాలన్నారు. అలాగే తన భార్యను చూస్తుండటం కూడా నేను ఇష్టపడుతుంటానని పరోక్షంగా సెటైర్లు వేశారు. నెటిజన్లు కూడా సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇలాచేస్తే.. కుటుంబానికి సమయాన్ని కేటాయించలేమని, జీవితం సాఫీగా ఉండదంటూ హితువు పలికారు. 

Also Read: మళ్ళీ హాట్ టాపిక్ అయిన జెలెన్ స్కీ డ్రెస్..రిపోర్టర్ కు కౌంటర్ ఇచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు

Advertisment
తాజా కథనాలు