India-China : పాకిస్తాన్‌ను చావు దెబ్బ కొట్టిన చైనా.. ఇండియాకు ఫుల్ సపోర్ట్!

భారత ప్రధాని నరేంద్ర మోదీ,  చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్తాన్‌ను  చైనా చావు దెబ్బ కొట్టింది. టెర్రరిజంపై పోరాటంలో భారత్‌కు ఫుల్ సోపోర్ట్‌ గా ఉంటామని చైనా హామీ ఇచ్చింది.

New Update
india

భారత ప్రధాని నరేంద్ర మోదీ,  చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్తాన్‌ను  చైనా చావు దెబ్బ కొట్టింది. టెర్రరిజంపై పోరాటంలో భారత్‌కు ఫుల్ సోపోర్ట్‌ గా ఉంటామని చైనా హామీ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్‌ టైమ్‌లో పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చిన చైనా..   పాకిస్తాన్‌కు ఫైటర్ జెట్లు, ఆయుధాలు సమకూర్చింది. ట్రంప్‌ - పాకిస్తాన్‌ దోస్తీతో... పాక్‌కు చైనా కటీఫ్‌ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్‌ తర్వాత పరిణామాలు వేగంగా మారాయని చెప్పాలి. ట్రంప్‌ను చచ్చిన పాముగా భారత్, చైనా, రష్యా  ట్రీట్ చేస్తున్నాయి. ట్రంప్‌ను లైట్‌ తీసుకున్నాయి బ్రిక్స్ దేశాలు. 

కాగా ప్రధాని మోదీ తియాంజిన్ నగరంలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు అనేక మంది ప్రపంచ నాయకులు హాజరయ్యారు. మోదీ జి జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరువురు నేతల మధ్య దాదాపు 10 నెలల తర్వాత ఈ సమావేశం జరిగింది. ఈ చర్చల్లో సరిహద్దుల్లో శాంతి, సుస్థిరత, సరిహద్దు ఉగ్రవాదం అంశాలను మోదీ ప్రస్తావించారు. సరిహద్దు సమస్యకు పరిష్కారం కనుగొనాలని, రెండు దేశాల మధ్య విభేదాలు వివాదాలుగా మారకూడదని ఇరువురూ అభిప్రాయపడ్డారు. 

Also Read :  Lunar Eclipse: చంద్రగ్రహణం.. ఈ రెండు రాశుల వారు చాలా జాగ్రత్త.. గ్రహణాన్ని చూస్తే!

భారత్-చైనా కలిసి పనిచేయాలని

ప్రపంచ వాణిజ్యాన్ని స్థిరీకరించడానికి భారత్-చైనా కలిసి పనిచేయాలని ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత పెరిగింది. మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కూడా సమావేశం కానున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా విధించిన సుంకాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.  మోదీ పర్యటనపై చైనా మీడియా, సోషల్ మీడియాలో ప్రత్యేక ఆసక్తి కనిపించింది. 

7 ఏళ్ల తర్వాత మోదీ చైనాకు రావడాన్ని, అమెరికా సుంకాల ఒత్తిడికి లొంగకుండా మోదీ వ్యవహరిస్తున్న తీరును ప్రశంసించాయి. ఈ పర్యటన ఇరుదేశాల సంబంధాల్లో ఒక కీలక మలుపుగా చైనా మీడియా పేర్కొంది. ఈ పర్యటనలో మోదీ కోసం ప్రత్యేకంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఇష్టమైన 'హాంగ్‌క్వీ' కారును ఏర్పాటు చేశారు. ఈ పర్యటన ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. అమెరికా విధిస్తున్న అదనపు సుంకాల దెబ్బ.. భారత్‌-చైనాను దగ్గరకు చేరుస్తోంది. చైనా డ్రాగన్, భారత ఏనుగు కలిసి నాట్యం చేయాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌.. భారత ప్రధాని నరేంద్రమోదీ వద్ద ఉద్ఘాటించారు. ఏడేళ్ల తర్వాత మోదీ చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి, అలాగే 2020 గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత కూడా ఇదే తొలి పర్యటన.

Also Read :  PM Shehbaz Sharif : పరువు పోయిందిగా.. పాక్‌ ప్రధానిని పట్టించుకోని మోదీ

Advertisment
తాజా కథనాలు