/rtv/media/media_files/2025/09/01/russia-2025-09-01-10-58-41.jpg)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) వాణిజ్య సలహాదారు పీటర్ నవారో(Peter Navarro) మరోసారి భారత్ పై తన అక్కసు వెళ్లగక్కారు. ఈ సారి మన దేశంలోని కులాలాను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుండంటంతో బ్రహ్మణులు లాభం పొందుతున్నారు.. ప్రజలు నష్టపోతున్నారని అన్నారు. ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పీటర్ నవారో మాట్లాడుతూ.. భారత్ లోని ఉన్నత వర్గాలు, ప్రత్యేకించి బ్రాహ్మణులు రష్యా నుండి తక్కువ ధరకు చమురును కొనుగోలు చేసి, దానిని రిఫైన్ చేసి, అధిక ధరకు విదేశాలకు అమ్ముతూ లాభాలు పొందుతున్నారని నవారో ఆరోపించారు.
Also Read : New Rules: గ్యాస్ నుంచి క్రెడిట్ కార్డు వరకు.. నేటి నుంచి మారనున్న రూల్స్ ఇవే!
Peter Navarro’s bizarre comment linking “Brahmins profiteering” with India-Russia oil ties shows how USA wants to spread fake narratives & divide India on religious lines.
— k. Amit verma (@engineer8960) September 1, 2025
🇮🇳 will always put national interest first. pic.twitter.com/YJMCb0TZ0k
సోషల్ మీడియాలో ఫైర్
ఈ లాభాలు భారత్ ప్రజలందరికీ కాకుండా, కేవలం ఒక వర్గానికి మాత్రమే వెళ్తున్నాయని ఆయన పేర్కొన్నారు. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వల్ల, ఉక్రెయిన్ యుద్ధానికి రష్యాకు ఆర్థికంగా సహాయం చేస్తున్నట్టేనని ఆయన అన్నారు. ఇది ఉక్రెయిన్‌లో అమాయక ప్రజల మరణాలకు పరోక్షంగా కారణమవుతోందని ఆయన పేర్కొన్నారు. దీంతో ఇండియన్స్ పీటర్ నవారో పై సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. భారత్ లోని కులాలను తెరపైకి తెస్తూ అమెరికా నీచంగ ప్రవర్తిస్తుందని కామెంట్స్ పెడుతున్నారు.
అమెరికా విధించిన 50% టారిఫ్‌లను పీటర్ నవారో సమర్థించుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్‌లు విధించే దేశాలలో భారత్ ఒకటి అని, ఇది అమెరికా కార్మికులకు నష్టం కలిగిస్తోందని, అందువల్ల ఈ టారిఫ్‌లు అవసరమని వివరించారు. కాగా గతంలో కూడా నవారో ఈ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని(Russia-Ukraine War) మోడీ యుద్ధం అని పేర్కొనడం వివాదాస్పదంగా మారింది. శాంతి స్థాపన మార్గం న్యూఢిల్లీ మీదుగా కూడా సాగుతుందని ఆయన అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ .. రష్యా, చైనా వంటి నియంతృత్వ దేశాలతో సంబంధాలను పెంచుకోవడం తనకు అర్థం కావడం లేదని నవారో వ్యాఖ్యానించారు.