JD Vance-Trump: అధ్యక్ష పదవిని చేపడతా.. ట్రంప్ కు జేడీ వాన్స్ ఝలక్‌!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం గురించి చర్చలు జరుగుతున్న వేళ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఏదైనా భయంకర విషాదం చోటు చేసుకుంటే తాను అధ్యక్ష పదవిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. 

New Update
United States Vice President JD Vance

United States Vice President JD Vance

దేశంలో ఏదైనా భయంకర విపత్తు వస్తే ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vance) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో అధ్యక్ష పదవిని స్వీకరించడానికి అయినా సిద్ధమని చెప్పారు.  ట్రంప్ ఆరోగ్యం మీద ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జేడీ వాన్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  యూఎస్ టుడే తో మాట్లాడుతూ వాన్స్ ఈ మాటలు మాట్లాడారు. కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. భయంకర విషాదాలు తలెత్తుతాయి. వాటన్నింటినీ దాటుకుని ట్రంప్ తన పదవీ కాలాన్ని పూర్తి చేశారని అన్నారు.  అధ్యక్షుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని అన్నారు. ఆయనతో పని చేసే వారందరూ చిన్నవాళ్లేనని...అయితే అందరి కంటే చివర నిద్రపోయేది, ఉదయాన్నే లేచేది మాత్రం అధ్యక్షుడేనని వాన్స్ చెప్పారు.  అమెరికన్లకు ఆయన మంచి చేస్తారనే నమ్మకం నాకుంది అని చెప్పుకొచ్చారు. 

కొన్ని రోజు క్రితం నుంచీ అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యం మీద చర్చ జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం ఆయన కాలు వాచి ఉండడం, చేతి మీద మచ్చ గురించి చర్చ జరిగింది. దీని గురించి అప్పుడు వైట్ హౌస్ ఏదో చెప్పి కవర్ చేసింది. కాలుకి సమస్య ఉందని ఒప్పుకున్నా..చేతి మీద మచ్చ గురించి మాత్రం అర్ధం పర్ధం లేని సంజాయిషీ ఇచ్చారు వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్. కాళ్ళలోని సిరల కవాటాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల రక్తం పేరుకుపోయి ఒత్తిడి పెరుగుతోందని అందుకే కాళ్ళు వాస్తున్నాయని తెలిపారు. వయసు పైబడిన వారిలో ఇది సాధారణంగా కనిపించే లక్షణమేనని తెలిపారు. అయితే దీని వలన ట్రంప్ ఇబ్బంది పడడం లేదని చెప్పారు. అదే సమయంలో చేతి మచ్చ గురించి చెబుతూ ఎక్కువ మందితో కరచాలనం చేస్తారని అందుకే అలా అయిందని అన్నారు.

Also Read :  ఎలుక.. ఏనుగును కొట్టినట్టుంది..టారీఫ్ లపై అమెరికా ఆర్థిక వేత్త వ్యాఖ్యలు

మళ్ళీ పెద్దగా కనిపిస్తున్న మచ్చ..

కానీ ఇప్పుడు మళ్ళీ ట్రంప్ చేతి మచ్చ మీద అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. తాజాగా పాపుల్స్ హౌస్ మ్యూజియం సందర్శించినప్పుడు, ఓవల్ ఆఫీస్ లో వరల్డ్ కప్ ఈవెంట్(World Cup Event) కు అటెండ్ అయినప్పుడు ట్రంప్ చేతి మీద మచ్చ చాలా పెద్దగా కనిపించింది. దాన్ని ఆయన దాచుకోవాలని చాలానే ప్రయత్నించారు కానీ..లేచి నిలబడినప్పుడు స్పష్టంగా కనిపించింది. పైగా మచ్చ కనిపించకుండా ఉండడానికి ట్రంప్ దాని మీద ఫౌండేషన్ మేకప్ వేసుకున్నారు. ఇది కూడా ప్రత్యేకంగా అందరికీ కనిపించింది. దీంతో మళ్ళీ అందరూ ట్రంప్ ఆరోగ్యం కోసం మాట్లాడుకుంటున్నారు. ఆయనకు ఏమైందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై వైట్ హౌస్ సెక్రటరీ కరోలినా లీవిట్ మళ్ళీ అదే వ్యాఖ్యలు చేశారు.  ట్రంప్ ప్రజల మనిషని.. మిగతా అధ్యక్షుల కంటే ఎక్కువగా అందరితో షేక్ హ్యాండ్ చేస్తారని అందుకే చేతి మచ్చ ఏర్పడిందని చెప్పుకొచ్చారు. పైగా ట్రంప్ నిబద్ధత దాని ద్వారా తెలుస్తోందంటూ కవర్ చేశారు. 

Also Read :  ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. 598 డ్రోన్లతో కాల్పులు

Advertisment
తాజా కథనాలు