/rtv/media/media_files/2025/08/28/russia-ukraine-war-2025-08-28-19-13-30.jpg)
14 Killed, 48 Injured In Mass Russian Drone And Missile Attack On Ukraine's Kyiv
ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఆపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అవి ఫలించడం లేదు. ఇరుదేశాలు ఒకాదానిపైమరొకటి దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై గురువారం రష్యా డ్రోన్ల దాడికి పాల్పడింది. మొత్తం 598 డ్రోన్లు, 31 తేలికపాటి క్షిపణులతో విరుచుకుపడింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ వర్గాలు తెలిపాయి. ఈ దాడుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారని.. మరో 48 తీవ్రంగా గాయపడ్డట్లు పేర్కొన్నాయి. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేశాయి.
14 dead incl 3 children after
— C4H10FO2P ☠️ (@markito0171) August 28, 2025
🇷🇺#Russia'n airstrikes on
🇺🇦#Ukraine capital #Kyivpic.twitter.com/KMFy7ACdJs
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇరుదేశాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్, అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కూడా ఆయన భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పందం వైపు అడుగులు పడుతున్న నేపథ్యంలో మళ్లీ ఇలా దాడులు జరగడం కలకలం రేపుతోంది. రష్యా తాజా దాడుల వల్ల మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని ఉక్రెయిన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనను ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా తీవ్రంగా ఖండించారు.
Also Read: దేశంలో 20 ఫేక్ యూనివర్సిటీలు ... అవి కూడా నకిలీవే తెలుసా?
రష్యా చర్చలకు రాకుండా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిని కోరుకునే దేశాలు ఈ ఘటనపై స్పందించాలని కోరారు. గతంలో చాలామంది శాంతి అని చెప్పి.. ఇప్పుడు మౌనంగా ఉండిపోయారంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. కీవ్ సిటీలో సుమారు 20 ప్రాంతాల్లో రష్యా డ్రోన్ దాడులు చేసినట్లు సమాచారం. దాదాపు 100 భవనాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. రష్యా ప్రయోగించిన వాటిలో 563 డ్రోన్లు, 26 క్షిపణులను నేలకూల్చామని ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ పేర్కొంది.
రష్యా ఉక్రెయిన్‌పై దాడులు చేసిన నేపథ్యంలో.. రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు పెంచడంతో పాటు మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని ఉక్రెయిన్ భావిస్తోంది. దీనిపై జెలెన్‌స్కీ కూడా మాట్లాడారు. యుద్ధాన్ని ఆపేందుకు రష్యా ఇచ్చిన గడువులు అతిక్రమించిందని ధ్వజమెత్తారు. ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పందం కోసం చేసిన దౌత్య ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయని మండిపడ్డారు. జెలెన్‌స్కీతో శాంతి చర్చలు జరపాలని ఇటీవల అమెరికా చేసిన ప్రతిపాదనను పుతిన్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీనిపై ట్రంప్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పుతిన్, జెలెన్‌స్కీ చర్చలకు షెడ్యూల్ ఖరారు కాకుండే రెండు వారాల్లో నిర్ణయం తీసుకంటానని గత శుక్రవారం ఉన్నారు.
Also Read: ట్రంప్ టారిఫ్‌లా.. రష్యా చమురు కొనుగోళ్లా.. ఇండియాకి ఏది బెటర్..?
ఇదిలాఉండగా గురువారం రాత్రి ఉక్రెయిన్ కూడా రష్యా పైకి డ్రోన్లతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ ప్రయోగించిన 102 డ్రోన్లను నేలకూల్చామని రష్యా రక్షణశాఖ పేర్కొంది. రష్యాలో నైరుతి భాగమే లక్ష్యంగా డ్రోన్ దాడులు చేస్తున్నారని ఆరోపణలు చేసింది. ఓ చమురుశుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడి చేయడం వల్ల మంటలు చెలరేగాయని అక్కడి స్థానికులు పేర్కొన్నారు. అలాగే సమర అనే మరో ప్రాంతంలో కూడా చమురు శుద్ధి కేంద్రంపై కూడా ఉక్రెయిన్ దాడులు చేసినట్లు సమాచారం.