On Trump Tariffs: ఎలుక..ఏనుగును కొట్టినట్టుంది..టారీఫ్ లపై అమెరికా ఆర్థిక వేత్త వ్యాఖ్యలు

భారత్ కు అమెరికా ఏం చేయాలో చెప్పడం ఎలుక..ఏనుగు పిడికిలితో కొట్టినట్లు ఉంది అని కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా ఆర్థిక వేత్త రిచర్డ్ వోల్ఫ్. ఇప్పుడున్న అతి పెద్ద దేశాల్లో భారత్ ఒకటి అని అన్నారు. దాంతో పెట్టుకోవడం మంచిదని కాదని అంటున్నారు.

New Update
trump tariffs

American Economist On US Action Against India

అమెరికా అధ్యక్షుడు ట్రంప్..భారత్ పై విధించిన అదనపు సుంకాలపై సొంత దేశంలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇప్నటికే చాలా మంది దీనిపై కామెంట్ చేశారు. తాజాగా అమెరికా ఆర్థిక వేత్త రిచర్డ్ వోల్ష్ అదనపు సుంకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా...భారత్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ తాను కఠినం అని నిరూపించాలనుకుంటోంది. బ్రిక్స్ పశ్చిమ దేశాలకు ఆర్థిక ప్రత్యామ్నాయంగా మారడం జీర్ణించుకోలేకపోతోంది. దాన్ని మార్చాలనే ప్రయత్నంలో తనను తాను కాల్చుకుంటోందని వోల్ఫ్ విమర్శించారు.   

ప్రపంచంలో అతి పెద్ద దేశం భారత్..

భారత్ కు...అమెరికా ఎగుమతులను ఆపేస్తే..ఆ దేశం వేరే ఆప్షన్లను కనుక్కుంటుంది. ట్రంప్ చర్యలు బ్రిక్స్ దేశాలను మరింత బలోపేతం చేస్తున్నారు. రష్యా ఎలా అయితే తన వస్తువులను అమ్మడానికి వేరే దేశాలను కనుక్కుందో భారత్ కూడా అదే చేస్తుందని రిచర్డ్ వోల్ఫ్ తెలిపారు.  భారతదేశం ఇకపై తన ఎగుమతులను అమెరికాకు కాదు, మిగిలిన బ్రిక్స్ దేశాలకు విక్రయిస్తుంది అని ఆయన అన్నారు. బ్రిక్స్ దేశాలు ఉత్పత్తి..ప్రపంచ ఉత్పత్తిలో 35శాతం. మరోవైపు జీ7 దేశాల ఉత్పత్తి 28 శాతానికి తగ్గింది. సోవియట్ కాలం నుంచి భారతదేశం అమెరికాతో దీర్ఘకాల సంబంధాన్ని కలిగి ఉందని...ఇప్పుడు దాన్ని పాడు చేసుకోవాలనుకోవడం అవివేకమని వోల్ఫ్ అన్నారు. 

మాకేం పర్లేదు...

మరోవైపు ట్రం టారీఫ్ లను భారత్ ఈజీగా తీసుకుంటోంది. అమెరికా కాకుండా మిడిల్ ఈస్ట్, చైనా వంటి దేశాలకు తన ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి ప్లాన్ చేస్తోంది. అంతా సర్దుకుంటుంది..ఏం పర్లేదు అంటోంది భారత్. అమెరికా అదనపు సుంకాలపై భయపడాల్సింది ఏమీ లేదని చెబుతోంది. టారీఫ్ ల సమస్య పరిష్కారానికి ఇరు దేశాల మధ్య చర్చలకు ఇంకా మార్గాలు తెరిచే ఉన్నాయని చెబుతోంది భారత ప్రభుత్వం.  దీనికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దాంతో పాటూ భారత్ ఇప్పుడు ఇతర దేశాలకూ ఎగుమతులను ప్రారంభించబోతోంది దీని వలన సుంకాల ప్రభావం అనుకున్నంత తీవ్ర స్థాయిలో ఉండకపోవచ్చని అంటోంది. ఎగుమతిదారులు ఆందోళన చెందాల్సి అవసర లేదని...ప్రభుత్వం అన్ని ఏర్పాట్లనూ చేస్తోందని చెబుతున్నారు. ఇరుదేశాల మధ్య దీర్ఘకాలిక సంబంధాల్లో ఇదొక తాత్కాలిక దశ మాత్రమేనని అన్నారు. 

Also Read: Mohan Bhagavath: రిటైర్ మెంట్ గురించి నేనెప్పుడూ మాట్లాడలేదు..మోహన్ భగవత్

Advertisment
తాజా కథనాలు