Bumrah: బుమ్రాకు అరుదైన గౌరవం.. టెస్టు టీమ్‌ ఆఫ్‌ది ఇయర్‌ కెప్టెన్‌!

భారత బౌలర్ బుమ్రాకు ఆస్ట్రేలియా గడ్డపై అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా 2024 'టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌'జట్టుకు బుమ్రాను కెప్టెన్‌గా ఎంచుకుంది. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో బుమ్రా 84 వికెట్లు పడగొట్టాడు. ఈ టీమ్‌లో యశస్వీ జైస్వాల్‌కు చోటు దక్కింది. 

New Update
Bumrah Australia

jasprit bumrah

Bumrah: భారత స్టార్ బౌలర్ జస్ర్పిత్ బుమ్రాకు ఆస్ట్రేలియా గడ్డపై అరుదైన గౌరవం దక్కింది. ప్రతి సంవత్సరం క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించే 'టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌'జట్టుకు ఈఏడాది బుమ్రాను కెప్టెన్‌గా ఎంచుకుంది. 2024 అన్ని ఫార్మాట్లలో బుమ్రా 84 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ టీమ్‌లో ఇండియానుంచి యశస్వీ జైస్వాల్‌కు చోటు దక్కింది. 

Also Read: బ్యాడ్ న్యూస్ ఫర్ ఇండియా.. హిట్‌మ్యాన్, కింగ్ రిటైర్ కావడం లేదు

క్రికెట్‌ ఆస్ట్రేలియా 2024 జట్టు..

బుమ్రా(కెప్టెన్‌) (భారత్‌), జైస్వాల్‌ (భారత్‌) బెన్‌ డక్కెట్‌, జోరూట్‌ (ఇంగ్లాండ్‌), రచిన్‌ రవిచంద్ర (న్యూజిలాండ్‌) హారీ బ్రూక్‌ (ఇంగ్లాండ్‌) కమింద్‌ మెండిస్‌ (శ్రీలంక) అలెక్స్‌ కేరీ (ఆస్ట్రేలియా) మాట్‌ హెన్రీ (న్యూజిలాండ్‌)  హేజిల్‌వుడ్‌ (ఆస్ట్రేలియా), కేశవ్‌ మహరాజ్‌ (దక్షిణాఫ్రికా)

australia cricket
cricket Australia 

2024 సీజన్ లో మొత్తం బుమ్రా 84 వికెట్లు పడగొట్టాడు. టీమ్‌ ఇండియాకు 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ అందించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. 2024 టీ20 ప్రపంచకప్‌లో అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టాడు. ఇప్పుడు బోర్డర్ గావాస్కర్‌ ట్రోఫీలోనూ తొలి మ్యాచ్‌ కెప్టెన్ గా భారత్ కు భారీ విజయాన్ని అందించాడు. 4 టెస్టుల్లో 30 వికెట్లు తీశాడు. బుమ్రా తర్వాత శ్రీలంక ఆటగాడు హసరంగ 64 వికెట్లతో 2024లో రెండో స్థానంలో నిలిచాడు.

Also Read: వచ్చే ఏడాది టీమిండియా ఫుల్ బిజీ.. పూర్తి షెడ్యూల్ ఇదే..!

ఇక యంగ్ బ్యాటర్ యసశ్వీ జైస్వాల్‌  2024 సీజన్‌లో భీకర ఫామ్ లో ఉన్నాడు. 15 మ్యాచ్‌ల్లో 1478 పరుగులు చేశాడు. ఒక డబుల్ సెంచరీ (214), మూడు సెంచరీలు, 9 హాఫ్ సెంరీలతో టాప్‌ స్కోరర్‌ గా రెండో స్థానంలో కొనసాగుతున్నారు. మొదటి స్థానంలో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్‌ ఉన్నాడు.

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు