Israel-Hamas war: పెను విషాదం.. 103 మంది మృతి

గాజాలో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పలు నివాసాలు, శిబిరాలపై శనివారం రాత్రి ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 103 మంది మృతి చెందారు. వీళ్లలో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు.

New Update
Israeli strikes across Gaza kill at least 103 people, hospitals and medics say

Israeli strikes across Gaza kill at least 103 people, hospitals and medics say

ఇజ్రాయెల్ హమాస్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి. గాజాలో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పలు నివాసాలు, శిబిరాలపై శనివారం రాత్రి ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో ఖాన్‌యూనిస్‌లో 29, ఉత్తర గాజాలో 48, జబాలియాలో ఉన్న శరణార్థి శిబిరంలో 26 మంది మృతి చెందారు. మొత్తంగా 103 మంది ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. వీళ్లలో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు.

Also Read: పాక్ గూఢచారి.. యూట్యూబర్ మల్వోత్రా గురించి ఈ 5 విషయాలు తెలిస్తే షాక్ అవుతారు!

ఇందులో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. వీళ్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే తాజాగా జరిగిన దాడులపై మాత్రం ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక శనివారం ఒక్కరోజే 150 మంది చనిపోయారని.. 450 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 

Also Read: మోదీ, అమిత్ షా కొత్త స్కెచ్.. బీజేపీకి కొత్త బాస్ ఎవరో తెలుసా?

మార్చి 18న ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురైన సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి భీకర దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటిదాకా 3 వేల మందికి పాగా పాలస్తీనియన్లు మృతి చెందినట్లు గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం చేసుకునేందుకు హమాస్ అంగీకరించడం లేదని అందుకే తాము దాడులు తీవ్రతరం చేసినట్లు స్పష్టం చేశారు. మా బందీలను విడుదల చేసేందుకు హమాస్ నిరాకరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజాలో హమాస్‌ స్థావరాలే లక్ష్యంగా ఐడీఎఫ్‌ దాడులు చేస్తోందని ఎక్స్‌ వేదికగా తెలిపారు.  

Also Read: పాక్ వ్యక్తితో రిలేషన్.. ఇండియన్ అధికారులకు వలపు వల.. జ్యోతి వ్యవహారంలో సంచలన విషయాలు!

Also Read: ఉక్రెయిన్‌పైకి రష్యా మరోసారి భీకర దాడులు

 israel | hamas | israel-hamas 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు