/rtv/media/media_files/2025/06/22/netanyahu-2025-06-22-08-25-36.jpg)
Israel PM Netanyahu
ఇరాన్ పై యూఎస్ అటాక్ చేయడాన్ని ఇజ్రాయెల్ సెలబ్రేట్ చేసుకుంటోంది. అగ్రరాజ్యం అమెరికా తమకు తోడుగా వచ్చినందుకు ఆనందంగా ఉందని చెబుతోంది. దీనిపై ఆ దేశ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అధ్యక్షుడు ట్రంప్ కు అభినందనలు. మీ అద్భుతమైన, ధర్మబద్ధమైన శక్తితో ఇరాన్ అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నారు. మీ సాహసోపేతమైన నిర్ణయం చరిత్రను మార్చేస్తుందని నెతన్యాహు ట్రంప్ ను పొగడ్తల్లో ముంచెత్తారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ లో ఇజ్రాయెల్ చేసిన దాడుల కంటే అమెరికా చేసిన దాడులు అద్వితీయమైనవని ఆయన అన్నారు. ఇంకే దేశం చేయలేని పనిని మీరు చేశారని పొగిడారు. ఇరాన్‌పై దాడుల్లో యూఎస్ చాలా శక్తితో వ్యవహరించింది. ట్రంప్ మీకు నా ధన్యవాదాలు. ఇజ్రాయెల్ ప్రజల తరఫు నుంచి కూడా అని నెతన్యాహు మాట్లాడారు.
Also Read: పదిహేనేళ్ల సంసారంలో ఊహించని ట్విస్ట్ ! చంపుతుందనే భయంతో లవర్ తో భార్యకు పెళ్లి!
Israeli Prime Minister Benjamin Netanyahu said after the US attacked Iran:
— Megh Updates 🚨™ (@MeghUpdates) June 22, 2025
"The United States has done an incredible job."
"Power is what brings peace"
"First strength is shown, then peace is established." pic.twitter.com/eYgQCx9kUK
Also Read : ఆపరేషన్ సింధు.. ఇరాన్ నుంచి స్వదేశానికి మరో 310 మంది
మూడు అణు కేంద్రాలు ఎగిరిపోయాయి..
ఎన్ని రోజులు వెయిట్ చేసినా లాభం లేదనుకుందో ఏమో, దాని కోసం రెండు వారాలు టైమ్ కూడా వేస్ట్ అనుకున్నట్టుంది..అందుకే ఉన్నట్టుండి ఇరాన్ పై విరుచుకుపడింది. ఈరోజు ఇరాన్ లో అణు స్థావరాలపై అటాక్ చేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫార్దో, నతాంజ్, ఇస్ఫహాన్ న్లూక్లియర్ ఫ్లాంట్ ల మీద దాడి చేసింది అమెరికా ఆర్మీ. ఇరాన్ గగనతలం బయట నుంచి అమెరికా యుద్ధ విమానాలు ఫోర్డ్ న్యూక్లియర్ రియాక్టర్ మీద బాంబు పడేసాయని ట్రంప్ చెప్పారు. ఆ తర్వాత అవి సురక్షితంగా వెనక్కు తిరిగి వచ్చేశాయి. మా గ్రేట్ అమెరికన్ వారియర్స్ కు కంగ్రాట్స్ అని కూడా ట్రంప్ అన్నారు.
Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!
Also Read: Iran-Israel War: ఇజ్రాయెల్ దాడుల్లో ముగ్గురు కీలక ఐఆర్‌జీసీ కమాండర్ల మృతి
attacks | usa | Israeli PM Netanyahu | today-latest-news-in-telugu