Ahmedabad Plane Crash: డైరెక్టర్‌ మిస్సింగ్‌ మిస్టరీ.. విషాదం మిగిల్చిన విమాన ప్రమాదం

అహ్మదాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌లో జూన్‌ 12న లండన్‌ బయల్దేరిన ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదం జరిగిన రోజు మిస్సయిన మ్యూజిక్ ఆల్బమ్స్ డైరెక్టర్, గుజరాతీ సినీ దర్శకుడు మ‌హేష్ జీరావాలా మృతి చెందినట్లు అధికారులు దృవీకరించారు.

New Update
Mahesh-Jirawala

Mahesh-Jirawala

అహ్మదాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌లో జూన్‌ 12న లండన్‌ బయల్దేరిన ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.  అయితే ఈ ప్రమాదం జరిగిన రోజు మిస్సయిన మ్యూజిక్ ఆల్బమ్స్ డైరెక్టర్, గుజరాతీ సినీ దర్శకుడు మ‌హేష్ జీరావాలా మృతి చెందినట్లు అధికారులు దృవీకరించారు. ప్రమాదం జరిగిన రోజునుంచి ఆయన ఆచూకీ లభించలేదు. దీంతో ఆయన అదృశ్యం ఇన్నాళ్లు మిస్టరీగా మారగ డీఎన్‌ఏ పరీక్ష ద్వారా అతని మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

Director's missing mystery

ప్రమాద స్థలంలో ఆయనకు సంబంధించిన యాక్టివా స్కూటర్‌, ఫోన్ కూడా లభించడంతో ఆయన మృతి చెందినట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే ప్రమాదం జరిగిన రోజు ఎయిర్‌ పోర్ట్‌ సమీపంలో ఒకరిని కలిసేందుకు వెళ్లాడని అతని భార్య హేతల్‌ తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలో అతని ఫోన్‌ లభించింది. అయితే అతని మృతదేహం మాత్రం లభించలేదు. దీంతో ఇన్నాళ్ల పాటు అతని మిస్సింగ్‌ మిస్టరీ వీడలేదు.  

Also Read :  ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం

ఆయన ఎవరినో కలవడానికి వెళ్లిన సమయంలోనే విమానం కూలటం, అది కూలిన ప్రదేశంలోనే మహేశ్‌ స్కూటీ,ఫోన్‌ లభించడంతో విమాన ప్రమాదంలోనే మహేశ్‌ జీరావాలా  మృతి చెంది ఉంటాడని తొలుత పోలీసులు భావించారు.  అక్కడ లభించిన మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రయత్నం చేశారు. కానీ మహేశ్‌ కుటుంబ సభ్యులు మాత్రం అందుకు అంగీకరించలేదు. ఆయన ఎయిర్‌పోర్ట్‌కు రాకపోవచ్చని, ఆ మృతదేహం ఆయనది కాకపోవచ్చని వారు వాదించారు. ఇక చేసిదిలేక కుటుంబ సభ్యుల నుంచి డీఎన్‌ఏ సేకరించిన అధికారులు మృతదేహం డీఎన్‌ఏతో పోల్చి చూశారు. డీఎన్‌ఏ రిపోర్ట్‌.. ఆ మృతదేహం మహేశ్‌దే అని నిర్ధారించడంతో మిస్సింగ్‌ మిస్టరీ విషాదంగా ముగిసింది.

Also Read :  ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి

Also Read :  దారుణం.. కోడలిని చంపి పాతిపెట్టిన అత్త - మామలు !

 

air india plane crash news | air india plane accident | air india plane crash | aeroplane crashes | aeroplane crash causes | ahmedabad plane crash news | ahmedabad plane crash 2025

Advertisment
Advertisment
తాజా కథనాలు