Trump Nobel Prize: గొప్పలు చెప్పుకోనివ్వలేదు..భారత్ పై సుంకాలకు అదే కారణం..జెఫరీస్

భారత్ పై అమెరికా 50 శాతం టారిఫ్ లతో విరుచుకుపడింది. దీనికి అసలు కారణం రష్యా నుంచి చమురు దిగుమతి అని చెప్పింది. కానీ అసలు కారణం అది కాదు..ట్రంప్ ను గొప్పలు చెప్పుకోనివ్వక పోవడమే అంటోంది అమెరికా ఫైనాన్షియల్‌ సేవల సంస్థ జెఫరీస్‌. 

New Update
Donald Trump

Donald Trump

రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటూ ఉక్రెయిన్ తో యుద్ధానికి భారత్ ఉసి గొల్పుతోంది అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై అదనపు సుంకాలను విధించారు. అయితే టారిఫ్ ల వెనుక అసలు కారణం అది కాదంటూ భారత్ ఎప్పటి నుంచో చెబుతోంది. అమెరికా పాల ఉత్పత్తులను భారత్ లోకి రానివ్వకపోవడం వలన ట్రంప్ కు కోపం వచ్చిందని...అందుకే అదనపు సుంకాలు విధించారని చెప్పింది. ఏది ఏమైనా తమ రైతులకు, పాడి వ్యవసాయదారులకు నష్టం కలిగే పనులు చేయమని భారత ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దాని కోసం సుంకాలను ఎదుర్కొంటామని చెప్పారు. అమెరికా సుంకాలను అమలు చేశాక...తమ వ్యాపారాన్ని ఇతర దేశాలకు విస్తరిస్తూ ట్రంప్ కు గట్టి దెబ్బ కొట్టాలని డిసైడ్ అయింది భారత ప్రభుత్వం. దానికి గ్గ చర్చలు, సన్నాహాలు కూడా చేస్తోంది. ఇదంతా ఇలా ఉంటే..ట్రంప్ టారీఫ్ ల వెనుక మరో కారణం ఉందని అంటోంది అమెరికా ఫైనాన్షియల్‌ సేవల సంస్థ జెఫరీస్‌.

బాకా ఊదుకోనివ్వలేదు..

పహల్గాం దాడితర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య చిన్న పాటి యుద్ధం జరిగింది. నాలుగు రోజుల కాల్పుల తర్వాత ఇరు దేశాలూ ఒప్పందానికి వచ్చి యుద్ధాన్ని ఆపేశాయి. అయితే అప్పటి నుంచీ అమెరికా అధ్యక్షుడు భారత్, పాక్ వార్ ను తానే ఆపానంటూ బాకా ఊదుతూనే ఉన్నారు. దీన్ని భారత్ ఎప్పటికప్పుడూ ఖండిస్తూనే ఉంది. అసలు అమెరికా జోక్యమే లేదని...తమ రెండు దేశాలే మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చాయని తెలిపింది. అంతర్జాతీయ వేదిక మీద కూడా ట్రంప్ క్లెయిమ్ ను అడ్డంగా కొట్టిపడేసింది భారత్. ప్రధాని మోదీ కూడా దీనిని చాలాసార్లు స్పష్టం చేశారు.

కానీ ట్రంప్ మాత్రం ఇప్పటికీ ఛాన్స్ వస్తే చాలు భారత్, పాక్ యుద్ధం తానే ఆపానని గొప్పులు చెప్పుకుంటూనే ఉన్నారు. సుంకాల సాకు చూపి కాల్పులు విరమించేలా చేశానని కూడా చెప్పారు. కానీ భారత్ ముందు ఆయన ఆటలు సాగలేదు. దాంతో పాటూ నోబెల్ శాంతి బహుమతికి కూడా భారత్ ట్రంప్ ను నామినేట్ చేయలేదు. పాకిస్తాన్ వంత పాడింది కానీ...ఇండియా మాత్రం ఛీ పొమ్మంది. ఇదే భారత్ పై అదనపు సుంకాలు విధించడానికి కారణం అయింది అంటోంది అమెరికా  ఫైనాన్షియల్‌ సేవల సంస్థ జెఫరీస్‌. నోబెల్‌ శాంతి బహుమతి అభ్యర్థిత్వానికి ఆయన పేరును బాకా ఊదుకోవడానికి భారత్‌ అనుమతించలేదని తెలిపింది. ప్రపంచంలో ఎనిమిది యుద్ధాలను ఆపానని ట్రంప్ గొప్పలు చెప్పుకుంటున్నారు.  అందులో భారత్, పాక్ యుద్ధం ఒకటి. కానీ అది రిజిస్టర్ అవ్వాలంటే భారత్ ఆయనను నామినేట్ చేయాలి. అది జరగలేదు. దీంతో ట్రంప్ ఇండియాపై వ్యక్తిగత కోపం పెంచుకున్నారు అని చెబుతోంది జెఫరీస్. దానికి ప్రతిఫలమే టారీఫ్ లని చెబుతోంది. దీంతో పాటూ భారత్ చెప్పినట్టుగా అమెరికా పాల ఉత్పత్తులను వారి దేశంలోకి అనుమతించకపోవడం కూడా సుంకాలు విధించడానికి మరో కారణం అని తెలిపింది జెఫరీస్. 

Also Read:Indian Students: అమ్మో.. నేను పోను అమెరికాకు.. వీసా రూల్స్ తో వణుకుతున్న స్టూడెంట్స్!

Advertisment
తాజా కథనాలు