Indian Students: అమ్మో.. నేను పోను అమెరికాకు.. వీసా రూల్స్ తో వణుకుతున్న స్టూడెంట్స్!

అమెరికా అధ్యక్షుడి దెబ్బకు భారతీయ విద్యార్థుల కలలన్నీ చెల్లాచెదురైపోతున్నాయి. యూఎస్ లో చుదువుకోవాలంటే భయపడే పరిస్థితులు తీసుకువస్తున్నారు. తాజాగా విద్యార్థి వీసా కాలపరిమితిని నాలుగేళ్లు చేయాలనే నిర్ణయం తీసుకోవాలని అమెరికా ప్రతిపాదన పెట్టింది. 

New Update
students

Indian Students In USA

అమెరికా(usa) లో హైయ్యర్ స్టడీస్ చాలా బావుంటాయి. కాస్త ఫీజులు ఎక్కువైనా నాణ్యమైన విద్యనందిస్తాయి ఇక్కడ యూనివర్శిటీలు.  అందుకే యూస్ లో చదివారు అనగానే కంపెనీలు కూడా ఉద్యోగాలు ఇస్తాయి. అమెరికా చదువుకునేందుకు చాలా దేశాల వారు వస్తుంటారు. అందరి కంటే భారత్ నుంచి విద్యార్థులు ఎఫ్ 1 వీసా(F1 Visa) మీద ఎక్కువగా వస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 33 లక్షల మంది భారతీయ విద్యార్థులు(indian students) ఉన్నారు. అయితే ఇప్పుడు వీరి భవిష్యత్తుతో పాటూ ముందు ముందు రావాలనుకే వారి ఆశలు కూడా గల్లంతయ్యేలా కనిపిస్తున్నాయి. దానికి కారణం తాజాగా అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ తీసుకొచ్చిన ప్రతిపాదనే. 

నాలుగేళ్ళు మాత్రమే..

ఇప్పటికే విదేశీ విద్యార్థలు వీసాలను కఠినతరం చేసింది అమెరికా. దాంతో పాటూ సోషల్ మీడియా వెట్టింగ్ ను సూపర్ స్ట్రిక్ట్ గా అమలు చేస్తోంది. దీనికి తోడు మరో కొత్త రూల్ ను ఇప్పుడు ప్రవేశపెట్టనుంది యూఎస్ డిపార్ట్  మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్. విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్లు, మీడియా ప్రతినిధులకు జారీ చేసే వీసాలపై కాలపరిమితిని విధించింది. ఇకపై విదేశీ విద్యార్థులు నాలుగేళ్ళకు మించి ఉండకుండా వీసా నిబంధనలను కఠినం చేయనుంది. 

ప్రస్తుతం విదేశీ విద్యార్థులు ఎఫ్ 1 వీసాలపై అమెరికాలో చదువుకోవడానికి వస్తున్నారు. ఎక్స్ఛేంజ్ విజిటర్లు జే 1 వీసాలపై వస్తున్నారు. అయితే వీరి వీసా గడువు అయిపోయాక కూడా డ్యూరేషన్ ఆఫ్ స్టే తెచ్చుకుని అమెరికాలో ఉండొచ్చు. వారు ఎంతకాలం చదవాలనుకుంటే లేదా ఇంటర్న్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలనుకుంటే అంతకాలం ఉండొచ్చు. ఎక్స్ఛేంజ్‌ విజిటర్స్‌గా వచ్చే విద్యార్థులు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, స్పెషలిస్ట్‌లు, ట్రైనీలు, ఇంటర్న్‌లు, ఫిజీషియన్లకు కూడా ఈ సదుపాయం వర్తిస్తుంది. ఇప్పుడు దీన్నే మార్చేందుకు డిపార్ట్ మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం సిద్ధమైంది. ఇక మీదట ఈ వీసాలకు కొంత కాలం మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఈ కొత్త రూల్ భారత విద్యార్థులపై అత్యధిక ప్రభావం చూపనుంది.  ప్రస్తుతం 3.3లక్షల మందికి పైగా భారతీయులు అమెరికా వర్సిటీల్లో చదువుకుంటున్నారు. చదువు తర్వాత అమెరికాలోనే ఉండి ఉద్యోగాలు సంపాదించుకుంటారు చాలా మంది. ఇక మీదట అలా చేయడం కుదరదు.  

మామూలుగా ఎఫ్ 1 వీసా మీద చదువుకోవడానికి విద్యార్థులు అమెరికా వస్తుంటారు. యూఎస్ లో ఏ చదువుకు సంబంధించి కోర్సు అయినా కనీసం మూడు నుంచి నాలుగేళ్లు ఉంటుంది. ఎఫ్ 1 వీసా ఆ చదువు పూర్తి చేయడానికి మాత్రమే పనికి వస్తుంది. చదువు అయిపోయిన తర్వాత విదేశీ విద్యార్థులు ఓపీటీ ని తీసుకుంటారు. దాంతో ఒక ఏడాది అమెరికాలో ఉండేందుకు అనుమతి దొరుకుతుంది. ఇదయ్యే లోపు ఉద్యోగం వెతుక్కుంటారు. క్యాంపస్ ప్లేస్ మెంట్స్ వచ్చే వారికి ఈ ఇబ్బందులు ఏమీ ఉండవు. కానీ అవి చాలా తక్కువ మందికి మాత్రమే వస్తాయి. దీంతో చాలా మంది ఓపీటీనే ఆశ్రయిస్తారు. ఉద్యోగం వచ్చిన తర్వాత వీసాను ఛేంజ్ చేసుకుంటారు. సాధారణంగా కంపెనీలే వీసాలు చేయిస్తాయి కాబట్టి ఏమీ ప్రాబ్లెమ్ ఉండదు.  దాదాపు అందరూ ఇలానే చేస్తారు. 

Also Read :  మొదటి సీ డ్రోన్ ప్రయోగించిన రష్యా..పేలిపోయిన ఉక్రెయిన్ అతిపెద్ద నౌక

ఓపీటీ అంటే ఏంటి? 

ఓపీటీ అంటే ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌. దీని ద్వారా వారు కొత్త కోర్సులు చేస్తారు. దీనిని వారు ఎఫ్ 1 వీసా మీదనే చేస్తారు . ఎఫ్‌-1 వీసాలపై ఉన్న విదేశీ విద్యార్థులు తమ చదువుకు సంబంధించిన రంగాల్లో 12 నెలల వరకూ పని చేయడానికి ఓపీటీ అనుమతిస్తుంది. స్టెమ్‌ గ్రాడ్యుయేట్లకు అయితే ఈ గడువు మరో 24 నెలలు అదనంగా పొడిగించుకోవచ్చును. దీంతో వారు చదువు అయ్యాక కూడా మూడేళ్లు అమెరికాలో ఉండొచ్చును. హెచ్‌-1బీ వీసా కోసం దరఖాస్తు చేసే సమయంలో ఈ పని అనుభవం వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. హెచ్ 1 వచ్చాక మరో ఆరేళ్లు ఉద్యోగం చేసుకోవచ్చును. 

ఇప్పుడు దీనికే అమెరికా అడ్డు పెట్టాలని చూస్తోంది. ఎఫ్ 1 వీసాను నాలుగేళ్ళకు పరిమితి చేస్తే ఓపీటీని ఇవ్వరు. అప్పుడు అమెరికాలో ఉండాలంటే మళ్ళీ వీసాను అప్లై చేసుకోవాలి జాబ్ వస్తే పర్వాలేదు. కానీ జాబ్ లేకుండా మళ్ళీ చదువు కోసమో, ఇంక దేని కోసమో అయితే మాత్రం వీసా రావడం కష్టమే అవుతుంది.

బాగా పెరిగిపోయిన ఫీజులు...

పైన చెప్పినదంతా ఒక ఎత్తు అయితే అమెరికాలో చదువుకోవడానికి ఇప్పుడు భయపెడుతున్న మరో విషయం ఫీజులు. ముందే చెప్పినట్టు యూఎస్ లో యూనివర్శిటీ ఫీజులు చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఎంఎస్ చేయడానికి దాదాపు 25 లక్షల వరకూ ఖర్చు పెట్టాలి. అద ఎంఎస్ చదవాలి అంటే రూ. 52 లక్షలు అవుతోంది. భారత్ నుంచి అమెరికా వచ్చే వారి సంఖ్య ప్రతీ ఏటా పెరుగుతోంది. 2025లో ఈ సంఖ్య 15 లక్షలకు చేరింది. భారత్‌ నుంచి విదేశాలకు చదువుల కోసం వెళ్లే వారిలో 38 శాతం తెలంగాణ, ఏపీ వారే ఉన్నారు. 2019లో విదేశీ విద్యకు భారతీయులు చేసిన ఖర్చు రూ.3.10 లక్షల కోట్లు. 2022 నాటికి ఇది 9 శాతం పెరిగి రూ. 3.93 లక్షల కోట్లకు చేరింది. 2024లో ఖర్చు సుమారు 10 శాతం మేర పెరిగి, రూ. 4.32 లక్షల కోట్లకు చేరింది. 

నో పార్ట్ టైమ్..

భారత్ నుంచి వచ్చే వారు సాధారణంగా ఇంజనీరింగ్ అయిపోయాక రెండేళ్లు ఉద్యోగం చేసి...వచ్చిన డబ్బులను దాచుకుని, మరికొంత బ్యాంక్ లోన్ పెట్టుకుని వస్తారు. మరి కొంత మంది తల్లిదండ్రులు ఇచ్చే సొమ్ముకు తోడు బ్యాంక్ లోన్ పెట్టుకుంటారు. ఇంతకు ముందు వరకు విద్యార్థులకు అమెరికాలో చదువుకుంటూనే పార్ట్ టైమ్ ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉండేది. దీంతో తమ ఖర్చులకు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మేనేజ్ చేస్తారు. దాంతో పాటూ బ్యాంక్ లోన్ కూడా తీరుస్తుంటారు. అయితే ట్రంప్ ప్రభుత్వం వచ్చాక ఈ పార్ట్ టైమ్ ఉద్యోగంపై ఉక్కుపాదం మోపారు. యూనివర్శిటీల్లో కాకుండా బయట ఉద్యోగాలు చేస్తున్న వారిని చాలా మందిని పట్టుకుని దేశం నుంచి పంపించేశారు. దీంతో ఇప్పుడు పార్ట్ టైమ్ ఉద్యోగం ఆప్షన్ కూడా పోయింది.  దీని వలన ఇప్పుడు యూఎస్ కు చదువుకోవడానికి రావాలంటేనే విద్యార్థులు భయపడుతున్నారు. 

రెసిషన్...ఉద్యోగాల కోత..

ఇక ఉద్యోగాల విషయానికి వస్తే అమెరికాలో పరిస్థితులు అస్సలు ఏమీ బాలేవు. చాలా మంది ఉద్యోగాలు లేకుండా ఉంటున్నారు. ఇంకో వైపు కాస్ట్ కటింగ్ పేరుతో చాలా మందిని తీసేస్తున్నారు. ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్నవారే ఇప్పుడు అమెరికాలో ఉండడానికి భయపడుతున్నారు. ఎప్పుడు ఉద్యోగం పోతుందో అనే భయంతో బతుకుతున్నారు. ఇక ప్రెషర్స్ మొహం అయితే ఎవరూ చూడడం లేదు. దీంతో చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగం దొరికే పరిస్థితి అస్సలు లేదు. దానికి తోడు ఇప్పుడు వీసా కాల పరిమితిని కూడా కుదించడం విద్యార్థుల మీద పెద్ద బండ వేసినట్లయింది. 

Also Read: JD Vance-Trump: అధ్యక్ష పదవిని చేపడతా.. ట్రంప్ కు జేడీ వాన్స్ ఝలక్‌!

Advertisment
తాజా కథనాలు