/rtv/media/media_files/2025/11/05/mamadani-2025-11-05-11-15-05.jpg)
లాస్ట్ నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలు(elections) జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మేజర్ ఎన్నికలు జరిగాయి. నాలుగు పెద్ద రాష్ట్రాలు న్యూ యార్క్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, వర్జీనియాల్లో గవర్నర్, మేయర్ ఎన్నికలు జరిగాయి. వీటితో పాటూ స్థానిక ఎన్నికలు కూడా నిర్వహించారు. వీటిలో అత్యధికంగా డెమోక్రాట్లు విజయం సాధించి..మళ్ళీవచ్చేశాముఅంటూ జెండా ఎగురవేశారు. డెమొక్రాట్లు మూడు కీలక రేసులను గెలుచుకోవడం ద్వారా తమ పునరాగమనాన్ని ప్రకటించారు. న్యూయార్క్‌తో పాటు, వర్జీనియా మరియు న్యూజెర్సీ గవర్నర్ ఎన్నికలలో కూడా డెమొక్రాట్లు విజయం సాధించారు.
Also Read : బ్యాలెట్ లో నా పేరు లేదు..రిపబ్లికన్ల ఓటమిపై ట్రంప్ పోస్ట్
భారత సంతతి దెబ్బ..
ఈసారి ఎన్నికల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది భారత సంతతి విజయాల గురించి. నాలుగు రాష్ట్రాల్లో మూడు చోట్ల భారతీయ అమెరికన్లు(indian-origin) విజయం సాధించారు. వీటిల్లో అన్నింటి కంటే ముఖ్యమైనది న్యూయార్క్ మేయర్ గా జోహ్రాన్మామ్దానీఎన్నికవ్వడం. మమ్దానీని ఆపడానికి ట్రంప్ అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ విజయం మాత్రం అతన్నే వరించింది. 34 ఏళ్ల జోహ్రాన్మమ్దానీ న్యూయార్క్ తొలి ముస్లిం మేయర్ అయ్యారు. ఆయన విజయం అమెరికా(usa) లో ప్రగతిశీల రాజకీయాల్లో ఓ కొత్త సెన్సేషన్ అంటున్నారు. ఈ విజయంతో, మమ్దానీ డెమోక్రటిక్ పార్టీకి కొత్త ముఖంగా ఎదిగారు. మామ్దానీట్రప్ కు గట్టి పోటీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. సాంప్రదాయ రాజకీయాలకు దూరంగా ఉండి, ప్రజల నిజమైన సమస్యలపై దృష్టి సారించారు. ప్రజలు తమ సమస్యలను అర్థం చేసుకునే, వారితో మాట్లాడే .. వారు ఏమనుకుంటున్నారో మాట్లాడే నాయకుడిని కోరుకుంటున్నారనిజోహ్రాన్మమ్దానీ చూపించారని యూఎస్ రాజకీయ విశ్లేషకుడు ఆండ్రెస్బెర్నాల్ అన్నారు.
మరోవైపు వర్జీనియాలో రెండు కీలక స్థానాల్లో కూడా భారత సంతతికి చెందిన వ్యక్తులు విజయం సాధించారు. ఇందులో లెఫ్టినెంట్ గవర్నర్ గా గెలుపొందిన గజాలా హష్మి భారతీయురాలు. ఈమె హైదరాబాద్ లో పుట్టి..అమెరికాలో పెరిగిన వ్యక్తి. గజాలా హష్మీ రిపబ్లికన్ అభ్యర్థి జాన్ రీడ్‌ను ఓడించి చారిత్రాత్మక విజయం సాధించారు. అలాగే వర్జీనియా హౌస్ ఆఫ్ డెలిగేట్స్‌లోడిస్ట్రిక్ట్ 26 స్థానాన్ని గెలుచుకుని, భారతీయ-అమెరికన్ జెజె సింగ్ కూడా అద్భుతంగా రాణించారు.
Also Read: Trump Post: బ్యాలెట్ లో నా పేరు లేదు..రిపబ్లికన్ల ఓటమిపై ట్రంప్ పోస్ట్
Follow Us