Trump Post: బ్యాలెట్ లో నా పేరు లేదు..రిపబ్లికన్ల ఓటమిపై ట్రంప్ పోస్ట్

అమెరికాలో నాలుగు పెద్ద రాష్ట్రాల్లో జిగిన ఎన్నికల్లో రిపబ్లికన్లు ఓడిపోయారు. దీనిపై అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ..బ్యాలెట్ పేపర్లలో నా పేరు లేకపోవడం, గవర్నమెంట్ షట్ డౌన్ తమ ఓటమికి కారణమైందని అన్నారు.

New Update
Trump

Trump

అమెరికాలో ఈ రోజు చాలా ముఖ్యమైనరోజు. నాలుగు పెద్ద రాష్ట్రాలు అయిన న్యూయార్క్, వర్జీనియా, కాలిఫోర్నియా, న్యూజెర్సీల్లో గవర్నర్, మేయర్ ఎన్నికలు జరిగాయి. అన్ని చోట్లా డెమోక్రాట్లు విజయం సాధించారు. న్యూయార్క్ లో భారత సంతతి వ్యక్తి జోహ్రాన్మామ్దానీ మేయర్ గా ఎన్నికయ్యారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) స్పందించారు. బ్యాలెట్లలో తన పేరు లేకపోవడం వల్లనేడెమోక్రాట్లు గెలిచారంటూ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అలాగే నెల రోజులుగా కొనసాగుతున్న షట్ డౌన్ కూడా రిపబ్లికన్ల(republican party) ఓటమికి కారణమైందని అన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పాటూ కాలిఫోర్నియాలో ఎన్నికల ఫలితాలపై ట్రంప్‌ అసహనం వ్యక్తంచేశారు. రాజ్యాంగ విరుద్ధమైన రీమ్యాపింగ్‌ పేరుతో కాలిఫోర్నియాలో భారీ స్కామ్జరిగిందని..ఓటింగ్‌ ప్రక్రియలోనూ రిగ్గింగ్‌ చోటుచేసుకుందని ట్రంప్ ఆరోపించారు. మెయిల్‌-ఇన్‌ ఓట్లను పక్కనబెట్టేశారు.. ఇది చాలా తీవ్రమైన అంశమని మండిపడ్డారు.

trump

Also Read :  చిత్తుగా ఓడిపోయిన ట్రంప్ పార్టీ..జేడీ వాన్స్ తమ్ముడికీ తప్పని ఓటమి

న్యూయార్క్ లో ట్రంప్మద్దతుదారుల సందేశం..

మరోవైపు న్యూయార్క్ లో జోహ్రాన్మామ్దానీ ఎన్నికల సంబరాలను ట్రంప్మద్దతుదారులు హైజాక్ చేశారు. అక్కడి ప్రచార కార్యాలయంలో పోడియం వెనుక ఉన్న స్క్రీన్ పై ట్రంప్ మీ అధ్యక్షుడు అనే సందేశాన్ని ప్రదర్శించారు. జోహ్రాన్మద్దతుదారులు విజయాన్ని సెటబ్రేట్ చేసుకుంటున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది ఎవరు ప్రదర్శించారనేది మాత్రం తెలియలేదు. ఇదే సందేశాన్ని ఎన్నికలు ఫలితాలు రాగానే వైట్ హౌస్ కూడా ప్రకటించడం గమనార్హం.

Also Read: Ghazala Hashmi: వర్జీనియా కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ గా హైదారబాదీ గజాలా హష్మీ

Advertisment
తాజా కథనాలు