/rtv/media/media_files/2025/12/07/jail-2025-12-07-16-44-52.jpg)
Indian-origin Uber driver jailed for seven years in New Zealand for raping teenage passenger
న్యూజిలాండ్(newzeland) లో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి ఏడేళ్ల జైలుశిక్ష పడింది. మైనర్(minor-girl)పై అత్యాచారానికి(rape-case) పాల్పడిన కేసులో అతడికి ఈ శిక్ష పడింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. సత్వీందర్ సింగ్ అనే వ్యక్తి గత 11 ఏళ్ల నుంచి న్యూజిలాండ్‌లో ఉంటున్నాడు. అతడు క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే 2023లో ఓ మైనర్ ప్రయాణికురాలు రాత్రిపూట అతడి క్యాబ్‌ను బుక్ చేసుకుంది.
Also Read: తటస్థంగా లేము..శాంతి వైపే ఉన్నాము..ప్రధాని మోదీ
Indian Origin Uber Driver Jailed For Seven Years In New Zealand
సత్వీందర్ సింగ్ ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. దారిలో వెళ్తుండగా జీపీఎస్‌ను ఆఫ్ చేశాడు. కారు రూట్ మార్చి వేరే చోటుకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన తర్వాత బాధితురాలిని ఆమె స్నేహితుల ఇంటి దగ్గర వదిలేశాడు. బాధితురాలి సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరాలతో పరిశీలించారు. అనంతరం సత్వీందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చివరికి ఈ కేసుపై అక్కడి కోర్టు విచారణ జరిపింది. సత్వీందర్ సింగ్‌ను దోషిగా తేల్చి ఏడేళ్లు జైలు శిక్ష విధించింది.
Also Read: ఆ దేశంలో పురుషుల కొరత.. భర్తలను రెంట్‌కు తెచ్చుకుంటున్న మహిళలు..
Follow Us