Renting Husbands: ఆ దేశంలో పురుషుల కొరత.. భర్తలను రెంట్‌కు తెచ్చుకుంటున్న మహిళలు..

పెళ్లయ్యాక భార్యభర్తలు అన్ని విషయాలు పంచుకుంటారు. కష్టసుఖాల్లో ఒకరినొకరు తోడుగా ఉంటారు. అయితే ఓ దేశంలో మాత్రం మహిళలు ఏకంగా భర్తలనే అద్దెకు తెచ్చుకుంటున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Women In This Country Are Renting Husbands Due To Shortage Of Men

Women In This Country Are Renting Husbands Due To Shortage Of Men

పెళ్లయ్యాక భార్యభర్తలు అన్ని విషయాలు పంచుకుంటారు. కష్టసుఖాల్లో ఒకరినొకరు తోడుగా ఉంటారు. అయితే ఓ దేశంలో మాత్రం మహిళలు ఏకంగా భర్తలనే అద్దె(Renting Husbands)కు తెచ్చుకుంటున్నారు. ఇంటి పనులు, ఇతర అవసరాల కోసం వీళ్లను ఉపయోగించుకుంటున్నారు. అంతేకాదు భర్తలను అద్దెకిచ్చే సంస్థలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంతకీ అది ఎక్కడో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. యూరప్‌(europe) లోని లాత్వియా అనే దేశం ఉంది. ఇక్కడ పెళ్లి కాని పురుషులకు ఎంతో డిమాండ్ ఉంది. దీనిక కారణం అక్కడ మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువగా ఉన్నారు. 

Also Read: తటస్థంగా లేము..శాంతి వైపే ఉన్నాము..ప్రధాని మోదీ

Renting Husbands In Europe

దీంతో అక్కడ అమ్మాయిలకు పెళ్లి చేసుకునేందుకు అబ్బాయిలు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకోసమే ఇంటిపనులు, ఇతర పనుల కోసం భర్తలను అద్దెకు తెచ్చుకుంటున్నారని ఓ అంతర్జాతీయ మీడియా తన కథనంలో వెల్లడించింది. ఆ కథనం ప్రకారం.. లాత్వియాలో పురుషుల కన్నా మహిళలు 25.5 శాతం ఎక్కువగా ఉన్నారు. 65 ఏళ్ల కన్న ఎక్కువ వయసు ఉన్న పురుషుల కన్నా కూడా మహిళలు రెండు రేట్లు ఎక్కువగా ఉన్నారు. దీనివల్ల పనిప్రదేశాల్లో, రోజువారీ జీవితంలో పురుషుల కొరత ఎక్కువగా ఉంది. కొంతమంది మహిళలు భాగస్వామి కోసం విదేశాలకు కూడా వెళ్లిపోతున్నారు.      

బయటికి వెళ్లలేని వారు భర్తలను అద్దెకు తెచ్చుకుంటున్నారు. గంటలు, రోజుల లెక్కన రెంట్‌కు తెచ్చుని వారి సేవలు వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే భర్తలను సరఫరా చేసేందుకు చాలా సంస్థలు పుట్టుకొచ్చాయి. కొమండా 24 లాంటి కంపెనీలు గంటల లెక్కన భర్తలను రెంట్‌కు తీసుకోండి అంటూ ఆఫర్లు ఇస్తున్నాయి. వారు ప్లింబింగ్, కార్పెంటరీ, మరమ్మతులు, అలాగే ఇంటి పనులు చేయడంలో సాయపడతారని చెబుతున్నాయి. ముఖ్యంగా ఇంటిపనులు, ఇతర పనుల్లో ఎక్స్‌పర్ట్ అయిన భర్తలకు ఎక్కువగా గిరాకీ నడుస్తోంది. మొత్తానికి లాత్వియాలో అద్దెకు వెళ్తున్న భర్తలు గంటకు 44 డాలర్ల చొప్పున రోజుకు 280 డాలర్లు డాలర్లు సంపాదిస్తున్నారు.  

Also Read: అవును మేమిద్దరం ప్రేమలో ఉన్నాం.. ట్రూడో, కేటీ పెర్రీ ఇన్స్టాలో పోస్ట్ లు

అయితే అక్కడ లైఫ్‌స్టైల్, దురలవాట్ల వల్లే పురుషుల జనాభా తగ్గిపోయి లింగ అసమతుల్యత ఏర్పడిందని అక్కడి వారు చెబుతున్నారు. లాత్వియాలో 31 శాతం స్మోకింగ్ చేస్తారని.. అలాగే ఎక్కువమంది ఊబకాయంతో బాధపడుతున్నట్లు తెలిపారు. జపాన్‌లో కూడా కుటుంబ సభ్యులుగా లేదా సహచరులుగా అద్దెకు దొరికే రెంట్ ఫ్యామిలీ సేవలు ఉన్నట్లు తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు