/rtv/media/media_files/2025/12/07/modi-2025-12-07-08-28-42.jpg)
రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటనలో ప్రముఖంగా వినిపించిన వాటిల్లో ఉక్రెయిన్ తో యుద్ధం విషయం కూడా ఉంది. దీనిపై ఇరు దేశాధినేతలూ చర్చించారని తెలిసింది. ఇందులో ఉక్రెయిన్ యుద్ధంలో భారతదేశం తటస్థంగా లేదని, శాంతి పక్షాన ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారని చెబుతున్నారు. మొదట నుంచి తాము ఇదే వైఖరిని వ్యక్తం చేస్తున్నామని...ఈ ఏడాది మొదట్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో కూడా ఇదే చెప్పామని మోదీ అన్నారు. ఇక ప్రధాన మోదీ రష్యా అధ్యక్షుడి గురించి మాట్లాడుతూ పుతిన్ ను దార్శనికుడు అని ప్రశంసించారు. ఇది శాంతి యుగం అనే విషయం తామిద్దరికీ బాగా తెలుసునని...తామెల్లప్పుడూ దాని వైపే ఉంటామని చెప్పారు.
శాంతి వైపే మా చూపు ఎప్పుడూ..
భారతదేశం తటస్థంగా లేదు. భారతదేశానికి ఒక వైపు ఉంది, అది వైపు శాంతి ఉంది. శాంతి కోసం చేసే అన్ని ప్రయత్నాలకు మేము మద్దతు ఇస్తాము. భుజం భుజం కలిపి నిలబడతాము అని ప్రధాని మోదీ అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా మోదీ మాటలను ఎక్కడా ఖండించలేదు. పైగా ఆసక్తిగా విన్నారు కూడా. అలాగే దీంతో పాటూ రష్యాకు ఎప్పుడూ తాము అనని విధాలుగా అండగా ఉంటామని ప్రధాని మరో సారి ఉద్ఘాటించారు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఎన్ని ఆంక్షలు ఎదురైనా తాము తట్టుకుని నిలబడ్డామని..ఆ బంధం ఎప్పటికీ అలానే కొనసాగుతుందని చెప్పారు. భారత్, రష్యాల మధ్య స్నేహం, వ్యాపారం, దౌత్య సంబంధాలు పుతిన్ పర్యటనతో మరింత మెరుగుపడ్డాయని..ఇది భవిష్యత్తులో ఇంకా బలపడుతుందని చెప్పుకొచ్చారు.
మరిన్ని S-400 స్క్వాడ్రన్లు
పుతిన్ పర్యటనలో భాగంగా 'రికార్సిప్రొకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్' (RELOS) ఒప్పందం జరిగింది. దీని ప్రకారం ఇరు దేశాల సైనిక బలగాలు, నౌకలు, విమానాలు లాజిస్టిక్ మద్దతు కోసం ఈ సౌకర్యాలను ఒకరినొకరు వినియోగించుకోవచ్చు. దీనివల్ల ఉమ్మడి సైనిక విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు, మానవతా సహాయక కార్యకలాపాలు అలాగే విపత్తు సహాయక చర్యల సమయంలో ఇంధనం, విడిభాగాలు, మరమ్మతు సౌకర్యాలను పరస్పరం అందించుకునేందుకు మార్గం సులభతరం అవుతుంది.
S-400 స్క్వాడ్రన్ల అదనపు డెలివరీలు, అత్యాధునికి SU-57 స్టెల్త్ ఫైటర్ జెట్లు, అలాగే S-500 అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ షీల్ట్ వ్యవస్థల కొనుగోలుపై చర్చలు జరిపారు. మరో అయిదు S-400 స్క్వాడ్రన్లు కొనుగోలు చేసేందుకు ఒప్పందం జరిగనట్లు తెలుస్తోంది. అలాగే మేక్ ఇన్ ఇండియా చొరవ కింద ఏకే-203 రైఫిళ్లు, బ్రహ్మోస్ క్షిపణులు, రష్యా నుంచి సరఫరా అయ్యే రక్షణ పరికరాల విడిభాగాలు, ఇతర ఉత్పత్తులను ఉమ్మడి తయారీని ప్రోత్సహించడం కోసం ఇరుపక్షాలు అంగీకారం తెలిపాయి. వీటన్నిటితో పాటూ అమెరికా నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ.. తక్కువ ధరకే ముడి చమురును నిరంతరాయంగా సరఫరా చేసేందుకు కట్టుబడి ఉంటామని పుతిన్ ప్రకటించారు.
Follow Us