/rtv/media/media_files/2025/05/21/kcdEtx7Cbx8vR2bWrwst.jpg)
Supreme Court
సుప్రీంకోర్టు బెయిల్‌కి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసింది. మనీలాండరింగ్ కేసులో బెయిలివ్వాలంటే ఏడాదిపాటు జైల్లో ఉండాల్సిన రూల్ ఏమీ లేదని తేల్చిచెప్పింది. గతేడాది అన్వర్ ధెబార్ అనే వ్యాపారవేత్త రూ.2 వేల కోట్ల లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయ్యారు. బెయిల్ పిటిషన్ వేయగా మంగళవారం సుప్రీం ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. ధెబార్ అరెస్టయి సంవత్సరం కూడా కాలేదని.. ఆయనకు బెయిల్ ఇవ్వకూడదని ఈడీ తరఫు న్యాయవాది వాదనలు చేశారు.
Also Read: విద్యార్థులకు షాక్.. అమెరికా, బ్రిటన్, కెనడాల్లో ఉద్యోగాల్లేవు
పలు కేసుల్లో బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు 'ఏడాది కస్టడీ బెంచ్‌మార్క్‌ను' అనుసరిస్తోందని తెలిపారు. ఈ కేసులో కూడా ఇదే అనుసరించాలని కోరారు. ధెబర్‌కు రాజకీయంగా పలుకుబడి ఉందని.. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తే తమ విచారణకు ఆటంకం కలగొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై సుప్రీం ధర్మాసనం ఈ విధంగా వ్యాఖ్యానించింది.
Also Read: ఇంటిపైనే సోలార్ ప్యానెల్స్.. రూ.78 వేల వరకు కేంద్రం సబ్సిడీ
'' ఈ కేసులో 450 మంది సాక్షులున్నారు. ఇప్పటిదాకా 40 మంది దర్యాప్తు మాత్రమే జరిగింది. దీనిపై విచారణ త్వరలో ముగిసే సూచనలు కనిపించడం లేదు. విచారణ ఇంకా పురోగతిలోనే ఉంది. దీనిపై గరిష్ఠ శిక్షాకాలం ఏడేళ్లు. ఇప్పటికే పిటిషనర్ 9 నెలల పాటు జైల్లో ఉన్నారు. బెయిల్ ఇచ్చేందుకు ఏడాది పాటు జైల్లో గడపాలని రూల్ ఏమీ లేదని ''సుప్రీం ధర్మాసనం తెలిపింది. ప్రత్యేక కోర్టు పెట్టిన కఠిన షరతులు, రూల్స్‌కు కట్టుబడి ధెబర్‌ను వారం రోజుల్లోగా బెయిల్‌పై విడుదల చేయాలని దిగు కోర్టుకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు ఆయన పాస్‌పోర్టును కూడా అప్పగించాలని చెప్పింది.
Also Read: ఆప్కు మరో ఎదురుదెబ్బ, పార్టీలోని ఏకైక ట్రాన్స్ జెండర్ కౌన్సిలర్ రాజీనామా
Also Read: జ్యోతి మల్హోత్రా డైరీ స్వాధీనం.. వెలుగులోకి సంచలన విషయాలు
Supreme Court | liquor-scam | telugu-news