USA: లైంగిక వేధింపుల ఆరోపణలు.. అమెరికాలో అరెస్టయిన భారతీయుడు

లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అమెరికాలో భారత్‌కు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడితో పాటు మరో ముగ్గురు విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. సియాటెల్‌కు చెందిన యూఎస్‌ ఇమిగ్రేషన్, కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది.

New Update
Indian national arrested by U.S. immigration authorities

Indian national arrested by U.S. immigration authorities

లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అమెరికాలో భారత్‌కు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడితో పాటు మరో ముగ్గురు విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వాషింగ్డన్ రాష్ట్రంలోని సియాటెల్‌కు చెందిన యూఎస్‌ ఇమిగ్రేషన్, కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఆ భారతీయుడి పేరు జస్పాల్ సింగ్ అని పేర్కొంది. ఇక మిగతా వారిది గ్వాటెమాలా, ఎల్‌సాల్వడర్‌, మెక్సికో అని చెప్పింది. ఈ మగ్గురు వాషింగ్టన్‌లోనే అరెస్టయ్యారు. 

Also read: ఇండో అమెరికన్ నాయకురాలు క్షమా సావంత్‌కు భారత్ వీసా తిరస్కరణ

ఇదిలాఉండగా.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలి తీసుకున్నాక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిదే. ముఖ్యంగా అక్రమ వలసదారులపై కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే భారతీయ అక్రమ వలసదారులను ప్రత్యేక సైనిక విమానాల్లో స్వదేశానికి పంపిస్తున్నారు. ఇటీవలే రెండుసార్లు భారతీయులను వెనక్కి పంపారు. ఇలాంటి తరుణంలో తాజాగా ఓ భారతీయుడు అక్కడ అరెస్టయ్యాడు. అయితే అరెస్టయిన వాళ్లు అక్కడ అక్రమంగా నివసిస్తున్నారా ? లేదా? అనేది తెలియాల్సి ఉంది. 

Also Read: ఆప్‌ ఓటమిపై స్పందించిన ధ్రువ్‌ రాఠీ.. బీజేపీపై విమర్శలు

ఇటీవలే మరో సంచలన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అమెరికా నుంచి మరో 487 మంది భారత విద్యార్థులను వెనక్కి పంపించనుంది. ఈ విషయంపై ఇప్పటికే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్స్‌పై భారత్‌తో చర్చలు జరిపామని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.  ఇటీవల వెనక్కి పంపిన భారతీయులకు సంకెళ్లు వేసి పంపించండం దుమారం రేపింది. దీంతో డిపోర్ట్‌ చేసేవారిని గౌరవంగా పంపాలని భారత్‌ అమెరికాను కోరింది. త్వరలోనే రాష్ట్రాలకు ఈ అంశంపై మార్గదర్శకాలు కూడా జారీ చేయనుంది. ఇప్పటికే ట్రంప్ సర్కార్.. 100 మంది భారతీయ విద్యార్థులను వెనక్కి పంపించింది. 

Also Read: మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్.. 50% ఛార్జీలు పెంపు!

ఇదిలాఉండగా అమెరికాలోని హోంలాండ్ అధికారుల లెక్కల ప్రకారం.. 20, 407 మంది భారతీయుల దగ్గర అమెరికాలో నివసించడానికి కావాల్సిన సరైన డాక్యుమెంట్స్ లేవని గుర్తించారు. అందులో 17,940 మందిని తిరిగి ఇండియా పెంపేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. 2,467 మంది ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ నిర్భందంలో ఉన్నారు. ఈ క్రమంలోనే దశల వారిగా అక్కడ ఉంటున్న వారిని వెనక్కి పంపిస్తున్నారు. 

Advertisment
Advertisment