Metro Rail: మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్.. 50% ఛార్జీలు పెంపు!

మెట్రో ప్రయాణికులు పిడుగులాంటి వార్త. బెంగళూర్ వాసులకు మెట్రో ప్రయాణం మరింత ఖరీదు కానుంది. ఫిబ్రవరి 9నుంచి టికెట్ ధరలను 50 శాతం పెంచుతున్నట్లు BMRCL తెలిపింది. అలాగే ఓలా, ఉబర్‌ తరహాలో పీక్‌, నాన్‌ పీక్‌ అవర్స్‌ విధానాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొంది. 

New Update
metro bglr

Bengaluru Metro Rail tickets increased

Bengaluru Metro Rail: మెట్రో ప్రయాణికులు పిడుగులాంటి వార్త వెలువడింది. బెంగళూర్ వాసులకు మెట్రో ప్రయాణం మరింత ఖరీదు కానుంది. ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీ సిఫార్సుల మేరకు ఫిబ్రవరి 9నుంచి టికెట్ ధరలను 50 శాతంపెంచుతున్నట్లు BMRCL తెలిపింది. ఓలా, ఉబర్‌ తరహాలో పీక్‌, నాన్‌ పీక్‌ అవర్స్‌ విధానాన్ని అమలుచేయనుంది. 

టికెట్ ధర రూ.60 నుంచి రూ.90..

ఈ మేరకు ప్రస్తుతం మెట్రో గరిష్ఠ టికెట్ ధర రూ.60 ఉండగా ఇకపై రూ.90 చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ ధరలను ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీ డిసెంబర్‌ 16న సమర్పించగా BMRCL బోర్డు ఆమోదం మేరకు ఫిబ్రవరి 9 నుంచి అమల్లో రానున్నాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 15 శాతం బస్సు ఛార్జీలను పెంచగా ఇప్పుడు మెట్రో ఛార్జీలు సైతం పెరుగడంపై ప్రజలపై భారం పడనుంది. 

ఇది కూడా చదవండి: Dhruv Rathee: ఆప్‌ ఓటమిపై స్పందించిన ధ్రువ్‌ రాఠీ.. బీజేపీపై విమర్శలు

పీక్‌ అవర్‌ టారిఫ్‌ సిస్టమ్‌..

ఇక ధరల పెంపుతోపాటు కొత్తగా పీక్‌ అవర్‌ టారిఫ్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మార్నింగ్ 6 నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, రాత్రి 9 గంటల తర్వాత ఆఫ్‌- పీక్‌ అవర్స్‌గా పేర్కొన్నారు. స్మార్ట్‌కార్డులపై పీక్‌ అవర్స్‌లో 10 శాతం, ఆఫ్‌ పీక్‌ అవర్స్‌లో 5 శాతం డిస్కౌంట్‌ ఉంటుంది. అయితే ఈ ధరల పెంపులో తమ జోక్యం లేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ చెప్పడం విశేషం. ‘ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రావాల్సిన ధరలను హోల్డ్‌లో పెట్టారు. ఛార్జీల పెంపుకు ముందు సమగ్ర రిపోర్టు సమర్పించాలని మోదీ ప్రభుత్వం ఆదేశించింది’ అని బెంగళూరు సెంట్రల్‌ ఎంపీ పీసీ మోహన్‌ పోస్ట్‌ చేయడం గమనార్హం. ఇప్పటికే రూమ్ రెంట్స్ అధికంగా ఉండటంతో కష్టంగా నెట్టుకొస్తున్న జనాలకు టికెట్ల రేట్ మరింత భారం కానుండగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు