జాబ్‌ ఇస్తానని నమ్మించి ఇరాన్‌లో భారతీయుడికి చిత్రహింసలు.. చివరికి

ఆస్ట్రేలియాలో ఉద్యోగం కోసమని వెళ్లిన ఓ భారతీయుడు ఇరాన్‌లో చిక్కుల్లో పడ్డాడు. ఓ ముఠా అతడిని కిడ్నాప్‌ చేసింది. చివరికి బాధితుడి కుటుంబం కిడ్నాపర్లకు రూ.20 లక్షలు చెల్లించి అతడిని విడిపించుకుంది.

New Update
Indian man kidnapped, tortured in Iran after being lured by promise of Australia job

Indian man kidnapped, tortured in Iran after being lured by promise of Australia job


ఆస్ట్రేలియాలో ఉద్యోగం కోసమని వెళ్లిన ఓ భారతీయుడు ఇరాన్‌లో చిక్కుల్లో పడ్డాడు. ఓ ముఠా అతడిని కిడ్నాప్‌ చేసింది. చివరికి బాధితుడి కుటుంబం కిడ్నాపర్లకు రూ.20 లక్షలు చెల్లించి అతడిని విడిపించుకుంది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన హిమాన్షు మాథుర్‌ అనే వ్యక్తి జాబ్‌ కోసం అమన్‌ రాఠీ అనే మరో వ్యక్తిని కలిశాడు. అమన్‌.. హర్యానాలోని కర్నాల్‌లో ఇమిగ్రేషన్ సేవలు అందిస్తున్నాని చెప్పాడు. హిమాన్షుకు కంటిన్యూస్ డిశ్చార్జి సర్టిఫికెట్‌ కోర్సు చేస్తే షిప్పింగ్‌ ఉద్యోగం వస్తుందని నమ్మించాడు.  

Also Read: ఈ అనుమానంతోనే లండన్‌లో నిరసనలు.. బ్రిటన్‌ని కదిలించిన ముగ్గురు పిల్లల చావు

 దీనివల్ల ఆస్ట్రేలియాలో వర్క్‌ వీసా ఈసీగా పొందొచ్చని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన హిమాన్షు నోయిడాలో ఆ కోర్సు పూర్తిచేశాడు. ఆ తర్వాత ఆగస్టులో అమన్‌.. హిమాన్షును కలిశాడు. ప్రస్తుతం తాను ఇండోనేషియాలో ఉన్నానని రూ.19 లక్షలకు వీసా ఇచ్చేందుకు ఓ ఏజెండ్ రెడీగా ఉన్నాడని చెప్పాడు. దీంతో హిమాన్షు ఢిల్లీ నుంచి జకర్తా వెళ్లాడు. అక్కడ అతడికి విశాల్ అనే పానిపట్‌కు చెందిన వ్యక్తిని కలిశాడు. కర్నాల్‌కు చెందిన తమ మనిషి ఆగస్టు 9న వస్తాడని.. అతడికి రూ.12 లక్షలు ఇవ్వాలని, మిగిలిన రూ.7 లక్షలు తర్వాత ఇవ్వామని చెప్పారు. 3 వారాల తర్వాత హిమాన్షు, అమన్‌ అలాగే విశాల్ కలిసి జకార్తా నుంచి ఢిల్లీకి వచ్చారు. 

Also read: భర్త ట్రిపుల్ తలాక్.. కోర్టు ముందే భర్తను చెప్పుతో చితకబాదిన భార్య: వీడియో వైరల్

ఆ తర్వాత ఆగస్టు 29న అమన్‌తో కలిసి హిమాన్షు ఇరాన్‌ బయలుదేరాడు. అక్కడి నుంచి తనను ఆస్ట్రేలియాకు పంపిస్తారేమోనని అతడు అనుకున్నాడు. కానీ వీళ్లని ఓ గ్యాంగ్‌ కిడ్నాప్ చేసింది. అయితే హిమాన్షును అక్కడ పరిచయం చేసుకున్న ఏజెంట్‌ మిథు అనే వ్యక్తి కూడా కిడ్నాప్‌ గ్యాంగ్‌లో ఒకడే. అక్కడ వాళ్లను మెటల్‌ పైపులతో కొట్టారు. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే అవయవాలు అమ్మేస్తానంటూ బెదిరించారు.

Also Read: ఆర్థిక ఇబ్బందులతో పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న దంపతులు..భర్త మృతి..భార్య ఏం చేసిందంటే..?

హిమాన్షును హింసిస్తున్నప్పుడు కిడ్నాపర్లు అతడి సోదరుడి కూడా వీడియో కాల్ చేశారు. ముందుగా రూ.కోటీ డిమాండ్ చేశారు. చివరికి రూ.20 లక్షలు తీసుకొని బాధితుడిని విడుదల చేశారు. ఈ డబ్బులను జలంధర్‌లో ఉన్న మరో వ్యక్తికి హిమాన్షు కుటుంబం డబ్బులు అందించింది. చివరికి ఆ కిడ్నాప్‌ గ్యాంగ్ హిమాన్షు, అమన్‌ను చాబహార్‌ ఎయిర్‌పోర్టు దగ్గర వదిలి వెళ్లిపోయింది. ఇక సెప్టెంబర్ 7న వాళ్లు ఢిల్లికి చేరుకున్నారని'' పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.  

Also Read: జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోల హతం.. మృతుల్లో అగ్రనేత

Advertisment
తాజా కథనాలు