/rtv/media/media_files/2025/04/27/F3ubK3om39DlsxLnRJ9K.jpg)
Anil Chauhan emergency meeting with Rajnath Singh
Pahalgam Attack: భారత్, పాక్ సరిహద్దుల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజ్‌నాథ్ సింగ్‌తో CDS అనిల్ చౌహన్ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. తాజా పరిస్థితులపై రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చించారు. ఎనీ టైం, ఎనీ వేర్ సిద్ధమంటూ నేవీ, ఎయిర్‌ఫోర్స్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎల్లప్పుడూ అలర్ట్‌గా, సిద్ధంగా ఉన్నాం. సరిహద్దు గ్రామాల ప్రజలు బంకర్లను సిద్ధం చేస్తున్నాయి. పాకిస్తాన్‌పై పక్కా ప్లాన్ ప్రకారం మెరుపు దాడులు చేస్తాం. ఇప్పటికే అట్టారీ సరిహద్దులో గ్రామస్తులను అలర్ట్ చేశాం. రెండు రోజుల్లో పొలాలు, గ్రామాలు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read : 45 రోజుల పాటు VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ
VIDEO | Delhi: Chief of Defence Staff (CDS) General Anil Chauhan arrives at the residence of Defence Minister Rajnath Singh.
— Press Trust of India (@PTI_News) April 27, 2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/9dfhW2GQGM
Also Read : ముంబై ఖాతాలో మరో ఘన విజయం.. లక్నో చిత్తు చిత్తు
యుద్ధం కోరుకోవడం లేదు..
మరోవైపు పాకిస్తాన్ యుద్ధం కోరుకోవడం లేదని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా మొహమ్మద్ ఆసిఫ్ మీడియాతో అన్నారు. అణుశక్తిని ఉపయోగించడం, యుద్ధం జరగాలని పాకిస్తాన్ కోరుకోవడం లేదని ఆయన అన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి మాత్రమే అణు బాంబును తయారు చేశామని ఆయన అన్నారు. భారతదేశంతో యుద్ధం చేసే ఉద్దేశ్యం మాకు లేదని, కానీ.. భారతదేశం మాపై దాడి చేస్తే మేము కూడా వెనక్కి తగ్గబోమని, పాకిస్తాన్ తగిన సమాధానం ఇస్తుందన్నారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!
నిఘా సంస్థల నివేదికల ప్రకారం పాకిస్తాన్‌లోని అనేక ప్రధాన నగరాలపై భారతదేశం దాడి చేయాలని చూస్తోందని పాకిస్తాన్ రక్షణ మంత్రి అన్నారు. ఇస్లామాబాద్, కరాచీ, రావల్పిండి సిటీపై భారత్ దాడులు చేస్తోందని ఇంటిలిజెన్స్ సమాచారం అందిందని అన్నారు. పాకిస్తాన్‌లో అరాచకాన్ని వ్యాప్తి చేయడానికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్‌ఎ, తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ టిటిపి వంటి నిషేధిత పాకిస్తాన్ సంస్థలకు భారతదేశం బాంబులు, ఆయుధాలను అందిస్తోందని ఖవాజా ఆసిఫ్ ఆరోపించారు.పాకిస్తాన్ ఈ విషయాన్ని అంతర్జాతీయ న్యాయస్థానానికి తీసుకెళుతుందని ఆయన అన్నారు.
Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. NIA చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు
pehalgam attack | rajnath-singh | telugu-news | today telugu news