/rtv/media/media_files/2025/04/27/ah5p5zMbIyZSHJ2qBjPi.jpg)
TTD cancels VIP break darshans for 45 days
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 45 రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. వేసవి సెలవులు ప్రారంభం అయ్యియి. దీంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read: పహల్గాం దాడిని పూర్తిగా షూట్ చేసిన వీడియోగ్రాఫర్.. కానీ
మే1 నుంచి రద్దు
ఇందులో భాగంగా మే 1వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ఎమ్మెల్యే, ఎంపీ, ఇతర ప్రముఖుల సిఫార్సులపై జారీ చేసే బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. అదే సమయంలో కేవలం ప్రొటోకాల్ పరిధిలో ఉన్న ప్రముఖులు స్వయంగా వస్తేనే బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనుంది. ఈ మేరకు మే 1వ తేదీ నుంచి ఉదయం 6 గంటలకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించనుంది.
Also Read: పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?
ఒక్కరోజే 82,811 మంది భక్తులు
ఇదిలా ఉంటే TTDలో టోకెన్లు లేని భక్తులకు దాదాపు 18 గంటల సమయం పైనే పడుతోంది. కేవలం ఒక్క శనివారం రోజే భారీగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు. సుమారు 82,811 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అదే సమయంలో 34,913 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కేవలం ఆ ఒక్క రోజే రూ.3.24 కోట్లు శ్రీవారి హుండీ ఆదాయం వచ్చింది.
Also Read: పహల్గాం దాడికి ముందు ఉగ్రవాదులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి సంచలన నిజాలు
Also read: కాంగ్రెస్ వాళ్లను ఉరికిచ్చి కొడతా... ఎర్రబెల్లి దయాకర్ రావు ఫుల్ ఫైర్
telugu-news | ttd | latest-telugu-news | tirumala tirupati temple