Hamas: హమాస్ లక్ష్యంగా ఐడీఎఫ్ దాడులు.. కీలక నేతలు మృతి!

హమాస్ అంతమే లక్ష్యంగా మరోసారి ఇజ్రాయెల్ భీకరదాడులకు దిగింది.ఈ దాడుల్లో పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ సీనియర్ రాజకీయ నాయకుడు ఇస్మాయిల్ బర్హౌమ్ సహా ఐదుగురు చనిపోయినట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి.

New Update
Israel Hamas War: హమాస్ సీనియర్ మెంబర్ ఖతం...మిలిటెంట్లు వెనక్కి తగ్గినట్టేనా?

హమాస్ అంతమే లక్ష్యంగా మరోసారి ఇజ్రాయెల్ భీకరదాడులకు దిగింది. గత వారం జరిపిన దాడుల్లో వందలాది మంది చనిపోగా.. మరోసారి ఆదివారం కూడా ఐడీఎఫ్ దళాలు భీకరదాడులకు పాల్పడ్డాయి. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ సీనియర్ రాజకీయ నాయకుడు ఇస్మాయిల్ బర్హౌమ్ సహా ఐదుగురు చనిపోయినట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి. 

Also Read: Tech Mahindra: ఖతార్ లో గుజరాత్‌ కి చెందిన టెక్ మహీంద్రా ఉద్యోగి అరెస్ట్

మరోవైపు నాజర్ ఆస్పత్రి మృతులు, క్షతగాత్రులతో నిండిపోయింది. దక్షిణ గాజాలో నాజర్ ఆసుపత్రి అతిపెద్దది. ఇందులో ఉగ్రవాదులు తిట్టవేస్తారన్న పక్కా సమాచారంతో ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. వైమానిక దాడుల నేపథ్యంలో అత్యవసర విభాగంలో మంటలు చెలరేగాయి. హమాస్ అగ్ర నాయకుడు ఇస్మాయిల్ బర్హౌమ్ మరణాన్ని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. వైమానిక దాడులతో ఖాన్ యూనిస్‌లోని ఆసుపత్రి సర్జికల్ భవనంలో పెద్ద అగ్నిప్రమాదం సంభవించిందని, అనేక మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 

Also Read:Bangladesh: ఢాకాలో భారీగా సైన్యం.. తిరుగుబాటు పరిస్థితులు..!

ఈ దాడులను హమాస్ కూడా ధృవీకరించింది. ఇక ఈ దాడులను ఇజ్రాయెల్ కూడా ధృవీకరించింది. ఆస్పత్రి నుంచి పని చేస్తున్న హమాస్ ఉగ్రవాదులను లక్ష్యంగా ఈ దాడులను చేసినట్లు తెలిపింది. ఏడాదికిపైగా గాజాపై ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. అయితే ఇటీవల అంతర్జాతీయ మధ్యవర్తుల చర్చల నేపథ్యంలో ఖైదీ-బందీల మార్పిడి ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. ఇరుపక్షాలు ఖైదీ-బందీలను విడుదల చేశారు. అయితే ఈ ఒప్పందం ఇటీవల ముగిసింది. ఈ ఒప్పందాన్నే కొనసాగించాలని ఇజ్రాయెల్ పట్టుబట్టింది. 

అందుకు హమాస్ అంగీకరించలేదు. దీంతో మరోసారి యుద్ధానికి ఇజ్రాయెల్ శ్రీకారం చుట్టింది. గత వారం జరిపిన దాడుల్లో వందలాది మంది ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఐడీఎఫ్ చేసిన దాడుల్లో హమాస్‌కు చెందిన కీలక నేతలు, వారి భార్యలు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: Italy: ఆ ప్రాంతంలో స్థిరపడితే కనుక రూ. 92 లక్షలు మీవే !

Also Read: TGSRTC: భారీ లాభాల్లో తెలంగాణ ఆర్టీసీ.. రూ.1,008.79 కోట్ల ఆదాయం!

 hamas | latest-news | gaza | israel | latest-telugu-news | latest telugu news updates 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు