/rtv/media/media_files/2025/03/24/71mNJjF3V0lskmS2H1gS.jpg)
italy
ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు సకల సౌకర్యాలు ఉంటాయని చాలా మంది నగరాల్లో ఉండేందుకు మొగ్గు చూపుతుంటారు.ఈ క్రమంలోనే ఇటలీకి చెందిన ఓ ప్రాంతం బంపర్ ఆఫర్ ఇచ్చింది.తమ గ్రామాల్లో స్థిరపడే వారికి రూ.లక్షల నజరానా ఇస్తామని ప్రకటన చేసింది. అయితే ఇటలీవాసులు,విదేశాల్లో ఉన్న ఇటాలియన్లకు మాత్రమే ఈ ఆఫర్ అని చెప్పింది.
Also Read: SKM: రైతులకు SKM కీలక పిలుపు.. పోలీసుల అణచివేతపై దేశవ్యాప్తంగా నిరసన!
ఉత్తర ఇటలీలో ట్రెంటినో ప్రావిన్సు అద్బుతమైన పర్వత ప్రాంతం.అయితే ఇక్కడి ప్రజలు పట్టణాలకు వెళ్లిపోతుండటంతో గ్రామాలు బోసిపోతున్నాయి.నివాసితుల కంటే పాడుబడిన ఇళ్లే ఎక్కువవుతున్నాయి.జనాభా తగ్గిపోతుండడంతో ఆ గ్రామాలు ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
Also Read: Viral video: ఫోన్‌లో IPL మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్.. భారీ జరిమానాతోపాటు..!
దాదాపు 33 ప్రాంతాలు ఈ ముప్పును ఎదుర్కొంటున్నట్లు అధికారులు గుర్తించారు.ఇటువంటి పట్టణాల్లో జనాభా అధికంగా ఉండడం వల్ల పాఠశాలలు సహా నిత్యావసర వస్తువుల దుకాణాలు,గ్యాస్ స్టేషన్లు కూడా మూతపడుతున్నాయి. తద్వారా నిర్మాణ రంగంతో పాటు సప్లై చెయిన్ కు ఆర్థికంగా చేయూత ఇచ్చినట్లవుతుందని భావిస్తున్నారు.
5 వేల కంటే తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇప్పటికే బడ్జెట్‌లో కేటాయింపులు చేయగా...మరికొన్ని వారాల్లోనే ఈ ప్రాజెక్టు తుది ఆమోదం పొందే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. ప్రాజెక్టులో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడే వారికి లక్ష యూరోలను అంటే రూ. 92 లక్షలను గ్రాంట్ గా ప్రకటించారు.
వీటిలో 80 వేల యూరోలు ఇంటి పునరుద్ధరణకు కాగా..మరో 20 వేల యూరోలు ప్రాపర్టీ కొనుగోలు కోసం ఇవ్వనున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా..పలు నిబంధనలు విధిఇంచారు. ఇది కేవలం ఇటలీవాసులతో పాటు విదేశాల్లో ఉన్న ఇటాలియన్లకు మాత్రమేనని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ ప్రాంతాల్లో నివాసముంటున్న 45 ఏళ్ల వయసు లోబడిన వారు ఈ పథకానికి అనర్హులుగా పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టు కింద లబ్ధి పొందేవారు పదేళ్ల పాటు ఇక్కడే నివాసం ఉంటామని హామీ ఇవ్వాలి.లేదా అన్నేళ్ల పాటు దానిని రెంటుకు ఇచ్చుకోవచ్చు.ఒకవేళ ఇందులో విఫలమైతే ఆ గ్రాంట్ అంతా వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుంది. స్థానికంగా జనావాసాలకు పునరుద్ధరించడంతో పాటు వారి మధ్య ఐకమత్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
జనాభా రేటు తక్కువగా ఉన్న దేశాల జాబితాలో ఇటలీ కూడా ఉంది.ముఖ్యంగా పని చేసే సామర్థ్యం ఉన్న వయసు వారి సంఖ్య 2040 నాటికి 19 శాతం తగ్గవచ్చని నివేదికలు చెబుతున్నాయి.దేశంలో 100 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 2014లో 17 వేలు ఉంటే 2024లో ఈ సంఖ్య 22వేలకు పెరిగిందని ఇటలీ జనగణన విభాగం వెల్లడించింది. స్థానికంగా నివాసం ఉండేందుకు ముందుకొచ్చే వారికి నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం,ఇటలీలో కొత్తేం కాదు.సెంట్రల్ ఇటలీ అబ్రుజోలో ఉన్న పెన్నే అనే పట్టణం కూడా ఇటీవల ఇటువంటి ప్రకటన చేసింది.
పాడుబడిన ఇళ్లను ఒక యూరో లేదా అంతకంటే తక్కవకే విక్రయిస్తామని ప్రకటించింది. ఏళ్ల క్రితం కొందరు వలస వెళ్లడంతో అనేక భవనాలు ఖాళీగా ఉన్నాయని స్థానిక మేయర్ తెలిపారు.
Also Read: Gayatri Bhargavi: థంబ్‌నెయిల్ కోసం నా భర్తను చంపేశారు!.. నటి భార్గవి ఫైర్
italy | latest-news | latest-telugu-news | latest telugu news updates