Israel: ఇరాన్‌లో 1,100 లక్ష్యాలను ధ్వంసం చేశాం.. ఇజ్రాయెల్‌ కీలక ప్రకటన

ఇరాన్ అణు ముప్పును తాము ఓ వ్యూహాత్మకంగా అణిచివేస్తున్నామని ఇజ్రాయెల్ సాయుధ దళాలు చెప్పాయి. ఇప్పటికే ఇరాన్‌లోని 1100 లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు IDF ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ తెలిపారు.

New Update
IDF says over 1,100 Iranian targets hit since Friday

IDF says over 1,100 Iranian targets hit since Friday

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇరాన్ అణు ముప్పును తాము ఓ వ్యూహాత్మకంగా అణిచివేస్తున్నామని ఇజ్రాయెల్ సాయుధ దళాలు చెప్పాయి. ఇప్పటికే ఇరాన్‌లోని 1100 లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు IDF ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ తెలిపారు. '' మేము ఓ పద్ధతి ప్రకారం ఇరాన్‌లో అణు స్థావరాలను ధ్వంసం చేస్తున్నాం. 

Also Read: 1978 కి ముందు ఇరాన్ ఎలా ఉండేదో తెలుసా ?.. వీడియోలు వైరల్

Also Read :  తగ్గేదే లే.. రక్తానికి రక్తమే సమాధానం.. ఇరాన్ సంచలన వార్నింగ్

IDF Says Over 1100 Iranian Targets

మేము చేసే దాడులు వాళ్ల నష్టాన్ని మరింత పెంచుతున్నాయి. ఫలితంగా వాళ్ల బాలిస్టిక్‌ క్షిపణులు, ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు దెబ్బతింటున్నాయని'' తెలిపారు. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఇదిలాఉండగా గత శుక్రవారం నుంచి ఇజ్రాయెల్‌.. ఇరాన్‌పై దాడులు చేస్తోంది. పశ్చిమ ఇరాన్, టెహ్రాన్ గగనతంలపై తాము పూర్తిగా పట్టు సాధించామని ఇజ్రాయెల్ దళాలు పేర్కొన్నాయి. ఇప్పటిదాకా 70 ఇరాన్ ఎయిర్‌ డిఫెన్స్‌ బ్యాటరీలు ధ్వంసం చేశామని చెప్పాయి. 

Also Read: ఐరన్‌ డోమ్‌కు చిల్లు.. ఒక్క రాత్రికి ఇజ్రాయెల్‌కు రూ.2400కోట్ల ఖర్చు..

Also Read: Allu Arjun: ఇది సార్ మా అన్న బ్రాండ్.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. వీడియోలు వైరల్!

 

telugu-news | rtv-news | israel iran war | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు