Israel: ఐరన్‌ డోమ్‌కు చిల్లు.. ఒక్క రాత్రికి ఇజ్రాయెల్‌కు రూ.2400కోట్ల ఖర్చు..

ఇరాన్ దాడులు అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం భారీగా వెచ్చించాల్సి వస్తోంది. దీని గగనతల డిఫెన్స్‌ సిస్టమ్‌ను నిర్వహించేందుకు ఒక్క రాత్రికే ఏకంగా 285 మిలియన్ డాలర్లు (రూ.2400 కోట్లు) ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది.

New Update
Israel Defence System

Israel Defence System

ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టెహ్రాన్‌లోని అణు స్థావరాలు, సైనిక మౌలిక సదుపాయాలపై ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. దీంతో ఇరాన్‌ కూడా ఇజ్రాయెల్‌ పైకి డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. అయితే ఇరాన్‌ వరుస దాడులతో ఇజ్రాయెల్ ఐరన్‌ డోమ్‌కు చిల్లుపడింది. దీంతో ఇరాన్ ప్రయోగించే క్షిపణులు ఇజ్రాయెల్‌లోని కీలక ప్రాంతాల వైపు దూసుకొస్తున్నాయి.  

Also Read: ఫైనల్ స్టేజ్‌లో ఇరాన్ న్యూక్లియర్ బాంబ్.. ఏ క్షణమైనా విధ్వంసం!

Operation Rising Lion 

అయితే వీటిని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం భారీగా వెచ్చించాల్సి వస్తోంది. దీని గగనతల డిఫెన్స్‌ సిస్టమ్‌ను నిర్వహించేందుకు ఒక్క రాత్రికే ఏకంగా 285 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.2400 కోట్లు. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తమ కథనంలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్‌ అంచనాలు తెలిసిన అమెరికా అధికారులను ఉటంకిస్తూ పేర్కొంది.   

Also Read: బద్దలైన అగ్నిపర్వతం.. వెనక్కి మళ్లిన ఎయిరిండియా విమానం

ఇదిలాఉండగా గతవారం 'ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో ఇరాన్‌లోని అణు స్థావరాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇరాన్ కూడా ఇజ్రాయల్‌ పైకి ప్రతిదాడులకు దిగింది. ఇప్పటిదాకా దాదాపు ఇజ్రాయెల్‌ పైకి 400 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించామని ఇరాన్ తెలిపింది. ఇవి చాలా ఎత్తులో ప్రయాణిస్తాయి. దీంతో ఈ క్షిపణులు అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ సైన్యం యారో సిస్టమ్‌ను వినియోగిస్తున్నాయి. అలాగే డేవిడ్స్‌ స్లింగ్, అమెరికా సరఫరా చేసినటువంటి పాట్రియాడ్స్, థాడ్‌ బ్యాటరీస్ వంటి అధునాత రక్షణ వ్యవస్థలను బరిలోగి దింపింది. 

Also Read: కాల్పుల విరమణలో మీ పాత్రేమిలేదు..ట్రంప్‌కు ఝలక్‌ ఇచ్చిన మోదీ

Also Read: వాట్సాప్‌ను డిలీట్‌ చేయండి.. ఇరాన్ సంచలన ప్రకటన

 

israel iran war | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | international news in telugu iron dome

Advertisment
Advertisment
తాజా కథనాలు