Iran: తగ్గేదే లే.. రక్తానికి రక్తమే సమాధానం.. ఇరాన్ సంచలన వార్నింగ్

ఇజ్రాయెల్, అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీ సంచలన వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ సరెండర్ అయ్యే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రక్తానికి రక్తమే సమాధామని అన్నారు. ఇజ్రాయెల్ చాలా పెద్ద తప్పు చేసిందని.. ఆ దేశాన్ని కచ్చితంగా శిక్షిస్తామన్నారు.

New Update
Iran will not surrender, Says Ayatollah Ali Khamenei

Iran will not surrender, Says Ayatollah Ali Khamenei

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇజ్రాయెల్, అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీ సంచలన వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ సరెండర్ అయ్యే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రక్తానికి రక్తమే సమాధామని అన్నారు. ఇజ్రాయెల్ చాలా పెద్ద తప్పు చేసిందని.. ఆ దేశాన్ని కచ్చితంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఇందులో అమెరికా తలదూరిస్తే పర్యావసనాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. శాంతి చర్చలకు ఒప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

Also Read: ఐరన్‌ డోమ్‌కు చిల్లు.. ఒక్క రాత్రికి ఇజ్రాయెల్‌కు రూ.2400కోట్ల ఖర్చు..

Also Read :  తమ్ముడి అంత్యక్రియల్లో మృత్యుంజయుడు రమేష్

Ayatollah Ali Khamenei Says - Iran

మరోవైపు ఇరాన్ అణుశుద్ధి స్థావరాలను దెబ్బతీయడమే ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే నంతాజ్ అణుశుద్ధి కర్మగారంపై దాడులు చేసింది. అయితే భూగర్భంలో నంతాజ్‌ అణుశుద్ధి ప్లాంట్‌ ఉంది. దీంతో ఇజ్రాయెల్ దాడి పెద్దగా నష్టం కలిగించలేదు. మరో కీలక అణు శుద్ధి కేంద్రమైన ఫోర్డోపై ఇజ్రాయెల్ దాడి చేసేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. భూమికి చాలా లోతులో ఈ ఫోర్డో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది. 

Also Read: ఫైనల్ స్టేజ్‌లో ఇరాన్ న్యూక్లియర్ బాంబ్.. ఏ క్షణమైనా విధ్వంసం!

అయితే వీటిపై బంకర్‌ బస్టర్ బాంబులు ఉపయోగించాలని ఇజ్రాయెల్ ప్లాన్ వేస్తోంది. భూగర్భంలోని అణు స్థావరాలను ధ్వంసం చేయగల బంకర్ బస్టర్‌ బాంబులు అమెరికా వద్ద మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా దగ్గర GBU - 57A/B పెనిట్రేటర్ బాంబులు ఉన్నాయి. ఈ బాంబులు తమకు ఇవ్వాలని ఇజ్రాయెల్‌ అమెరికాను విజ్ఞప్తి చేస్తోంది. అయితే దీనికి ఇంకా అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

Also Read :  ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. ఫిల్మ్ ఇండస్ట్రీతో A-8 చాణక్యకు ఉన్న లింకులేంటి?

 

telugu-news | rtv-news | israel iran war | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు