Bangladesh: యూనస్ ఒక ఉగ్రవాది..మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్ ఓ ఉగ్రవాది అంటూ  ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బంగ్లాకు తిరిగి వస్తానని, పార్టీ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటానని అన్నారు. 

New Update
Sheik Hasina:షేక్‌ హసీనాపై 53కు చేరిన కేసులు..

Sheik Hasina(Bangladesh EX Prime Minister)

బంగ్లాదేశ్ (Bangladesh) లోని అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఓ బహిరంగ కార్యక్రమంలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheik Hasina) పాల్గొన్నారు. జూమ్ మీటింగ్ ద్వారా ఆమె అందులో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న యూనస్ మీద మండిపడ్డారు. ఆయన ఒక ఉగ్రవాది అని ఘాటు విమర్శించారు. అలాగే తాను బంగ్లాదేశ్ మళ్ళీ తిరిగి వస్తానని...పార్టీ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. 

Also Read :  యూనస్ ఒక ఉగ్రవాది..మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

Also Read :  భార్యను చంపిన భర్త... పోలీసులకు పట్టించిన నాలుగేళ్ల కూతురి డ్రాయింగ్!

దేశాన్ని నడపడం రాదు...

తాను తిరిగి వచ్చేవరకు అవామీ లీగ్ పార్టీ నాయకులు ఓపికగా ఉండాలని, ఐకమత్యంతో ఉండాలని షేక్ హసీనా పిలుపునిచ్చారు. జులై- ఆగస్టుల్లో జరిగిన నిరసనల్లో మరణించినవారు పోలీసుల కాల్పుల కారణంగా చనిపోలేదు. వారికి ఇప్పుడు పోస్టుమార్టం నిర్వహిస్తే నిజాలు తెలుస్తాయని ఆమె అన్నారు.  విద్యార్థులు చేసిన ఆందోళనలకు చాలామంది పోలీసులు, అవామీ లీగ్ కార్యకర్తలు, విద్యావంతులు హత్యకు గురైయ్యారు. అయినా ప్రభుత్వాధినేత యూనస్ వారిపై ఎటువంటి చర్యా తీసుకోలేదు. దేశాన్ని పాలించడంలో యూనస్ కు ఎటువంటి అనుభవం లేదు.  ఇది ఇంతకు ముందు ఆయన కూడా అంగీకరించారు. అన్ని విచారణ కమిటీలను రద్దు చేసి దేశాన్ని నాశనం చేస్తున్నారని షేక్ హసీనా మండిపడ్డారు. 

Also Read: AP: తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ..హైటెన్షన్

యూనస్ ఒక ఉగ్రవాది అని...ప్రణాళిక ప్రకారమే తన తండ్రి నివాసాన్ని నాశనం చేయించారని మాజీ ప్రధాని ఆరోపించారు.  మధ్యంతర ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలు గడుస్తున్నా.. అల్లర్లు ఆగలేదు. బంగ్లాదేశ్ లో రోజురోజుకూ శాంతి భద్రతలు క్షీణించాయి. ప్రజల భద్రత ప్రమాదంలో ఉంది.  ఈ ఉగ్రవాద ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి అని షేక్ హసీనా బంగ్లా ప్రజలకు పిలుపునిచ్చారు. 

Also Read: Tesla: భారత్ లో టెస్లా ఉద్యోగాల జాతర మొదలు..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు