Rat Hole: అస్సాంలో భయంకమైన సంఘటన చోటుచేసుకుంది. 300 అడుగుల లోతున్న 'ర్యాట్ హోల్' మైన్‌లోకి నీరు చేరడంతో 18 మంది కార్మికులు చిక్కుకుపోయారు. పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని మోటార్ పంపుల ద్వారా బొగ్గుగనిలో నుంచి నీటిని తోడేస్తున్నారు.
We have requested the Army’s assistance in the ongoing rescue operation. The State Disaster Response Force (SDRF) and the National Disaster Response Force (NDRF) are also on their way to the incident site to aid in the efforts. https://t.co/35ET3f80jr
— Himanta Biswa Sarma (@himantabiswa) January 6, 2025
100 అడుగుల వరకు నీరు..
ఈ మేరకు డిమా హసావో జిల్లాలోని మారుమూల పారిశ్రామిక పట్టణమైన ఉమ్రాంగ్సోలో ఈ బొగ్గు గని ఉంది. అయితే ఈ గనిలోకి నీరు ప్రవేశించడంతో దాదాపు 18 మంది కార్మికులు చిక్కుకుపోయారు. 300 అడుగుల లోతైన ఈ అక్రమ క్వారీలో దాదాపు 100 అడుగుల మేర నీరు చేరిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని రెండు మోటార్ పంపుల ద్వారా నీటిని బయటకు పంపుతున్నారు. ఇక మేఘాలయ సరిహద్దుకు సమీపంలో ఉన్న ప్రాంతానికి రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాలు ఘటన స్థలానికి బయలుదేరాయి. ప్రస్తుతం కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌లో ఆర్మీ సహాయాన్ని కోరినట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు.
పర్యావరణానికి చాలా ప్రమాదం..
ఇక ఈ 'ర్యాట్ హోల్' మైనింగ్ ఒక ప్రమాదకరమైనదిగా పేర్కొన్నారు. ఈ సొరంగాలు లోతైన గుంటలకు దారితీస్తాయని, వాటి నుండి బొగ్గు తవ్వుతున్నట్లు స్థానికులు తెలిపారు. గనుల నుండి విడుదలయ్యే ఆమ్ల నీరు, భారీ లోహాలు వ్యవసాయంతోపాటు మంచినీటి వనరులను విషపూరితమైనవి చేయడంతోపాటు అవి పర్యావరణానికి కూడా హాని కలిగిస్తాయని ఆందోళన చెందుతున్నారు. గతంలోనూ 2018లో మేఘాలయలోని తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలోని అక్రమ బొగ్గు గనిలో సమీపంలోని నది నుండి నీరు రావడంతో 15 మంది మైనర్లు అందులో చిక్కుకున్నారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ చూసింది కేవలం రెండు మృతదేహాలు మాత్రమే అని అప్పటి కమాండెంట్ ఎస్కే శాస్త్రి చెప్పారు. 2019లో మేఘాలయ రాష్ట్రంలో అక్రమ బొగ్గు తవ్వకాన్ని అరికట్టడంలో విఫలమైనందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) రూ. 100 కోట్ల జరిమానా విధించింది. రాష్ట్రంలోని 24,000 గనుల్లో చాలా వరకు అక్రమ గనులు ఉన్నాయని ఎన్జీటీ తేల్చింది.