Maoist: మావోయిస్టు దాడిలో దుర్మరణం చెందిన జవాన్లకు హో మంత్రి అమిత్ షా(Amit shah) ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సైనికుల త్యాగం వృధా పోదని తాను భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. 'నేను మాటిస్తున్నా ఏ ఒక్కడినీ వదలం. 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని భారత గడ్డపై నుంచి నిర్మూలిస్తాం' అని పోస్ట్ పెట్టారు.
बीजापुर (छत्तीसगढ़) में IED ब्लास्ट में DRG के जवानों को खोने की सूचना से अत्यंत दु:खी हूँ। वीर जवानों के परिजनों के प्रति गहरी संवेदनाएँ व्यक्त करता हूँ। इस दुःख को शब्दों में व्यक्त कर पाना असंभव है, लेकिन मैं विश्वास दिलाता हूँ कि हमारे जवानों का बलिदान व्यर्थ नहीं जाएगा। हम…
— Amit Shah (@AmitShah) January 6, 2025
Also Read: HMPV వైరస్ కరోనా కంటే ప్రమాదకరమా?.. వైద్యులు ఏం చెబుతున్నారు?
చాలా బాధ కలిగించింది..
ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టిన అమిత్ షా.. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ లో జరిగిన IED పేలుడులో DRG సైనికులు మరణించారనే వార్త నాకు చాలా బాధ కలిగించింది. వీర జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ బాధను మాటల్లో చెప్పడం అసాధ్యం. కానీ మన సైనికుల త్యాగం వృధా పోదని నేను భరోసా ఇస్తున్నాను. 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని భారత గడ్డపై నుంచి నిర్మూలిస్తామన్నారు.
ఇది కూడా చదవండి: Telangana: కారులో ఇద్దరు సజీవ దహనం కేసులో కీలక ట్విస్ట్..
ఇదిలా ఉంటే.. మవోయిస్టులను పూర్తిగా ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. 2026 నాటికి వీరి ఉనికి లేకుండా చేస్తామంటున్న బీజేపీ ఇప్పటికే రూ.5,601 కోట్లు మంజూరు చేసింది. ఛత్తీస్‌గఢ్‌కే రూ.1,666 కోట్ల కేటాయించగా మరిం పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 2026 వరకు భారత దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగానే భారీ ఆపరేషన్స్ చేపడుతోంది. 'ఆపరేషన్ కగార్' పేరుతో ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాల అడవులను జల్లెడ పడుతుంది. ఇందుకోసం వేల సంఖ్యలో మిలటరీ బలగాలను దింపి రూ.వేల కోట్లు ఖర్చు చేస్తోంది. గతంలో ఏడాదికి దాదాపు రూ.వెయ్యి కోట్లు ఖర్చు ప్రభుత్వం.. రోజు రోజుకు పెంచుతూ పోతోంది. మావోయిస్టుల అడ్డ ఛత్తీస్‌గఢ్‌పై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. మావోయిస్టు అగ్రనాయకత్వం అబూజ్‌మడ్‌లో ఉండగా.. దట్టమైన అటవీప్రాంతం, ఎత్తైన కొండలను చేధించడం పోలీసులకు కష్టతరంగా మారింది. కానీ మావోయిస్టుల ప్రభావం లేకుండా చేసేందుకు బలమైన సంకల్పంతో ముందుకెళ్తున్న కేంద్రం.. ఇందుకోసం వేల కోట్లు కుమ్మరిస్తోంది. సెక్యూరిటీ రిలేటెడ్ ఖర్చు, స్పెషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్కీం, స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ వంటి పథకాల పేరుతో నిధులు రిలీజ్ చేస్తోంది.
Also Read: మావోయిస్టులను చంపేందుకు రూ.5,601 కోట్లు.. మరింత పెంచే ఛాన్స్!