/rtv/media/media_files/2025/04/22/6mFhYobJRFl3QiTE5myr.jpg)
The Harvard University campus in Cambridge
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలన ఇతర దేశాల వాళ్ళ అలా ఉంచితే సొంత దేశం వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండడం లేదు. మొన్నటి వరకు ఫెడరల్ ఉద్యోగులతో ఆడుకున్న అధ్యక్షుడు, ఆయన ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు యూనివర్శిటీలను టార్గెట్ చేశారు. గత కొన్ని రోజులుగా హార్డర్డ్ యూనివర్శిటీ, అమెరికా ప్రభుత్వం మధ్య గొడవ జరుగుతోంది. ఈ విశ్వవిద్యాలయానికి నిధులను కట్ చేశారు. తాము పెట్టిన డిమాండ్లను అంగీకరిస్తేనే అన్నీ సవ్యంగా జరుగుతాయని కండిషన్ పెట్టారు. దీనిని హార్వర్డ్ ఒప్పుకోకుండా ఫైట్ చేస్తోంది. దీనిలో భాగంగా ట్రంప్ ప్రభుత్వంపై యూనివర్శిటీ దావా వేసింది. హార్వర్డ్‌కు నిధులు నిలిపివేయడం ద్వారా విద్యాపరమైన నిర్ణయాలపై నియంత్రణ సాధించడానికి ప్రయత్నిస్తున్నారని కేసు దాఖలు చేసింది. అమెరికా ప్రభుత్వం టార్గెట్ చేసిన మిగతా యూనివర్శిటీలు, కాలేజీల పేర్లను కూడా ఇందులో మెన్షన్ చేసింది.
Also Read : సూర్యపేటలో హైటెన్షన్.. రోడ్డుపై ధాన్యం తగలబెట్టిన రైతులు.. ఏం జరిగిందంటే!
Also Read : ఫోన్ తీసుకుందని.. టీచర్‌ను చెప్పుతో కొట్టి, ల*జే అంటూ దాడిచేసిన విద్యార్థిని: (వీడియో)
ఎవరైనా సరే.. మా మాట వినాల్సిందే..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హార్వర్డ్ యూనివర్సిటీ కి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే ఆ విశ్వవిద్యాలయానికి అందించే 2.2బిలియన్ డాలర్ల ఫెడరల్‌న నిధులకు కత్తెర వేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో 1 బిలియన్ డాలర్ల కోతకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వైద్య పరిశోధనల కోసం యూనివర్సిటీకి ఇచ్చే ఫెడరల్ గ్రాంట్లు,కాంట్రాక్టుల నుంచి 1 బిలియన్ డాలర్లను తగ్గించాలని ట్రంప్ యంత్రాంగం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ వార్తను ప్రచురించింది. వైట్‌హౌస్ డిమాండ్లకు ఏ మాత్రం తలొగ్గేది లేదని హార్వర్డ్ అధ్యక్షుడు అలాన్ గార్బర్ పట్టుబట్టుకుని కూర్చోడంపై ట్రంప్ యంత్రాంగం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. తమ డిమాండ్లను రహస్యంగా ఉంచాలని ప్రభుత్వం కోరినప్పటికీ.. హార్వర్డ్ యూనివర్సిటీ వినలేదని..అందుకే దానిపై మిన్ని చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.
Also Read : కాంగ్రెస్ కు బిగ్ షాక్...గద్వాల ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
గాజా వివాదం తర్వాత హార్వర్డ్‌లో జరిగిన నిరసనల ఆధారంగా.. విశ్వవిద్యాలయంలో విధాన మార్పులు చేయాలని యూఎస్ గవర్నమెంట్ ఇప్పటికే డిమాండ్ చేసింది. అందులో అమెరికా విలువలకు ఏ విద్యార్థి అయినా వ్యతిరేకంగా ఉంటే వారిని క్యాంపస్ నుంచి తొలగించాలని చెప్పింది. దాంతో పాటూ యూదు వ్యతిరేక కార్యకలాపాలను నిమంత్రించాలని కోరింది. వీటిని హార్వర్డ్ యూనివర్శిటీ తిరస్కరించింది. అందుకు ప్రతిగా 2బిలియన్ల డాలర్ల సమాఖ్య నిధులను ప్రభుత్వం ఆపేసింది. హార్వర్డ్ ఇకపై అంతర్జాతీయ విద్యార్థులకు ఆతిథ్యం ఇవ్వడానికి అర్హత లేదని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం చెప్పింది.
today-latest-news-in-telugu | america president donald trump | government | Trump Vs Harvard
Also Read: USA: పిల్లలను కంటే 5 వేల డాలర్లు...ట్రంప్ జనాభా పెంచేందుకు చర్యలు