Formers fire: సూర్యాపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దంతాలపల్లి రహదారిపై ఆందోళనకు దిగిన రైతులు ధాన్యాన్ని తగలబెట్టారు.15 రోజులైనా వడ్లు కొనట్లేదంటూ రోడ్డుపై కంచెవేసి నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పేవరకు ఆందోళన విరమించేది లేదని చెబుతున్నారు.
15 రోజులైనా కొనట్లేదు..
ఈ మేరకు ఏసిల్లో కూర్చుని అధికారులు రైతు గోస చూడాలని కోరుతున్నారు. రైతుకంట కన్నీరు తుడవండి. మా ధాన్యం కొనేవరకు ఇక్కడి నుంచి వెళ్ళేది లేదంటున్నారు. 15 రోజులవుతున్న వడ్లు కొనుగోలు చేయడం లేదు. ఆరు నెలలు కష్టపడి పండిస్తే అమ్ముకునేందుకు ఇన్ని అవస్థలు పడుతున్నాం. పెట్టుబడి కూడా రాకున్నా పండిస్తున్నాం. అప్పులవాళ్లు, వరికోసిన మిషన్, డీజిల్ డబ్బులు ఇవ్వమని వేధిస్తున్నారని వాపోతున్నారు.
రేవంత్ రెడ్డి గారు దయచేసి మా వడ్లు కొనండి
— Telugu Scribe (@TeluguScribe) April 22, 2025
20 రోజుల నుండి ఐకెపిలో ఎలాంటి కాంటాలు జరగడం లేదని ధాన్యానికి నిప్పు పెట్టి రైతన్నల నిరసన
సూర్యాపేట నియోజకవర్గంలోని దంతాలపల్లి సూర్యాపేట రహదారి గుర్రం తండలో రోడ్డు ఎక్కిన రైతులు
20 రోజుల నుండి ఐకెపిలో ఎలాంటి కాంటాలు జరగక లారీలు రాక… pic.twitter.com/b5iE7h1vMQ
ఇక్కడ వ్యాపారులేమో ధాన్యం లోడింగ్‌కు బస్తాకు 10 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. 8 రూపాయలు ఇస్తామన్నప్పటికీ లోడింగ్ చేయడంలేదు. ఇన్నిరోజులనుంచి వడ్లు కొనకుంటే పెట్టుబడి తెచ్చిన కాడ ఏమి ఇవ్వాలి. కలెక్టర్ వచ్చి తమ సమస్యం పరిష్కరించేంత వరకు నిరసన కొనసాగిస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.
formers-protest | telugu-news | today telugu news