/rtv/media/media_files/2025/04/22/uXxNFstASwY8yEierv5A.jpg)
Vizianagaram student slapped teacher with shoe
Viral Video: ఈ తరం విద్యార్థులు గురువుల పట్ల ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే ఎంతో సిగ్గుచేటుగా ఉంది. విధ్యా బుద్దులు నేర్పే గురువుపై బూతులతో రెచ్చిపోయింది ఓ విద్యార్థిని. ఫోన్ తీసుకుందని టీచర్ పై చెప్పుతో దాడి చేసేందుకు తెగించింది. ఈ ఘటన ఆంద్రప్రదేశ్ విజయనగరంలోని రఘు ఇంజనీరింగ్ కాలేజీలో చోటుచేసుకుంది. విద్యార్థిని టీచర్ ని చెప్పుతో కొట్టిన వీడియో వైరల్ గా మారింది.
ఈ తరం పిల్లలు తమ గురువులకు ఇచ్చే గౌరవం ఇది...👆
— ꜱʀɪʀᴀɴɢᴀᴍ ꜱᴀɢᴀʀ(ᴍᴏᴅɪ ᴋᴀ ᴘᴀʀɪᴠᴀʀ) (@SAGAR4TBJP) April 22, 2025
తప్పు పిల్లలది కాదు, తల్లిదండ్రులది, టీచర్లది. పిల్లలకు ఫోన్లు కొనివ్వడం, వాళ్ళ గౌరవం కోసం లక్షల రూపాయల ఫీజులు కట్టే తల్లిదండ్రులు, లక్షల రూపాయల ఫీజులు తీసుకోని అమ్ముడుపోయిన టీచర్లు గౌరవాన్ని ఆశించడం సరైందేనా? #ShameOnSociety pic.twitter.com/tSmxNdNeW7
Also Read: Jwala Gutta :పండంటి పాపకు జన్మనిచ్చిన స్టార్ క్రీడాకారిణి గుత్తాజ్వాల!
టీచర్ పై చెప్పుతో దాడి..
అయితే వీడియోలో చూపించిన వివరాల ప్రకారం.. టీచర్ విద్యార్థిని నుంచి ఫోన్ తీసుకోవడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో విద్యార్థిని ఫోన్ 12వేలు ఇస్తావా? ఇవ్వవా? అంటూ టీచర్ ని బూతులు తిడుతూ గొడవకు దిగింది. చివరికి ఫోన్ ఇస్తావా? లేదంటే చెప్పుతో కొట్టమంటావా అంటూ టీచర్ పై రెచ్చిపోయింది. దీంతో టీచర్ ఇవ్వను అనేసరికి ఆమెపై చెప్పుతో దాడి చేసింది. ఆ తర్వాత టీచర్ విద్యార్థిని మధ్య గొడవ పెరగడంతో పక్కనే ఉన్న విద్యార్థులు, ఇతర టీచర్లు వారిని విడిపించే ప్రయత్నం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థిని తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ తరం పిల్లలు టీచర్లకు ఇచ్చే గౌరవం ఇది? అని ఎత్తిచూపుతున్నారు.
telugu-news | latest-news | Raghu Engineering College | vijayanagaram
Also Read:Mumbai:మీ నాన్న లాగే నిన్ను కూడా చంపేస్తాం..బాబా సిద్ధిఖీ కుమారుడికి బెదిరింపులు!
Also Read: Holiday Culture: హాలీడే కల్చర్ తో ఉత్పాదకత తగ్గిపోతుందన్న సీఈవో..మండిపడుతున్న నెటిజన్లు!