/rtv/media/media_files/2025/04/07/IFfjt98gndzJXJFw0oNg.jpg)
Trump
అమెరికాలో జనాభా రేటు తగ్గుతోంది. మొన్నటి వరకు అబార్షన్ చట్టం కూడా దీనికి సహకరించింది. కానీ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక అబార్షన్ హక్కులను రద్దు చేశారు. దాంతో పాటూ ఇప్పుడు ఆయన జనాభాను పెంచేందుకు చర్యలు తీసుకోనున్నారని తెలుస్తోంది. పిల్లను కనేలా ప్రజలను ప్రోత్సహించాలని ట్రంప్ అధికారులకు సూచించారని చెబుతున్నారు. దీనికి సంబంధించి ఐడియాస్ ను కూడా సేకరిస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా మొదటి బిడ్డను కంటే బేబీ బోనస్ కింద 5 వేల డాలర్లు, రెండో బిడ్డను కంటే ట్యాక్స్ క్రెడిట్స్ వంటివి ఇస్తారని సమాచారం. అలాగే బర్త్ కంట్రోల్ అవసరం లేకుండా అన్ వాంటెడ్ ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులు ట్రంప్ చెప్పారని తెలుస్తోంది.
Also Read : కాంగ్రెస్ కు బిగ్ షాక్... గద్వాల ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Also Read : ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే?
పరాకాష్టకు చేరుకున్న వాణిజ్య యుద్ధం..
ఇక అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఇరు దేశాల మధ్యా ప్రస్తుతం ప్రపంచ దేశాలు అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నాయని చెబుతున్నారు. చైనాతో వాణిజ్యాన్ని తగ్గించుకుంటే సుంకాలపై రాయితీలిస్తామని.. లేకపోతే మీ పని అంతేనని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ట్రంప్ టారీఫ్ లకు 90 రోజులు విరామం ప్రకటించాక జపాన్ తో పాటూ 70 దేశాలు సుంకాలపై చర్చలు జరుపుతున్నాయి. ఇలా తమ దగ్గరకు వచ్చినవారందరికీ అమెరికా అధ్యక్షుడు దే కండిషన్ పెడుతున్నారన తెలుస్తోంది. మరోవైపు అమెరికా ఒత్తిడికి తలొగ్గి తమ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఏ దేశమైనా వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చైనా కూడా బెదిరిస్తోంది.
today-latest-news-in-telugu | usa | america president donald trump | population
Also Read: Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ డెత్ రిపోర్ట్ వచ్చింది...అందులో ఏముందంటే..
Also Read : దేశంలో వడగాలులు ..IMD హెచ్చరికలు!