Australia: ఆస్ట్రేలియాలో మరో భారత విద్యార్థిపై దాడి..తెగిపడిన చెయ్యి

ఆస్ట్రేలియాలో భారతీయులపై వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. భారత విద్యార్థి సౌరభ్ ఆనంద్ పై దుండుగులు కత్తితో దాడి చేశారు. ఇందులో అతని చెయ్యి తెగిపోయింది. 

New Update
australia

Attack On Indian Student In Australia

సౌరభ్ ఆనంద్ ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో చదువుకుంటున్నారు. ఇతను ఆల్టోనా మెడోస్‌లోని ఓ ఫార్మసీ ఓ ఫార్మసీ నుంచి ఇంటికి వెళుతుండగా దుండుగులు అతనిపై కత్తితో దాడి చేశారు. ఇందులో సౌరభ్ మెడ, తలకు తీవ్ర గాయాలు కాగా.. చేయి తెగిపడింది. మొత్తం ఐదుగురు యువకులు గుంపుగా వచ్చి అతనిపై దాడి చేశారు. సౌరభ్ తీవ్రంగా ప్రతి ఘటించినప్పటికీ లాభం లేకపోయింది. ఆ సమయంలో అతడి చేతిలోకి కత్తి దూసుకుపోయింది. అనంతరం శరీరంలోని పలు చోట్ల కత్తులతో తీవ్రంగా గాయపరిచి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

Also Read :  హీరోయిన్ పై మనసు పడ్డ నాగవంశీ.. అందరిముందు ఇలా అనేశాడేంటి భయ్యా - వీడియో వైరల్

Also Read :  నంద్యాలలో ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మహిళలు!

తెగిపడిన చేయి..అతికించిన వైద్యులు..

సమాచారం అందుకున్న లోకల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సౌరభ్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తెగిపడిన చేతిని వైద్యులు మళ్లీ అతికించారని పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన ఐదుగురులో నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. 

అంతకు ముందు చరణ్ ప్రీత్ సింగ్ పై కూడా ఇదే తరహాలో దుండుగులు దాడి చేశారు. అతన్ని దూషిస్తూ..పదునైన వస్తువులతో కొట్టారు. ఈ ఘటనలో చరణ్‌ ముఖం, వెనక భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడులకు కారణం జాత్యాహంకారమేనని అక్కడి మీడియా చెబుతోంది.

Also Read: BIG BREAKING: హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట, ఆరుగురు భక్తులు మృతి 

Also Read :  సెక్స్ చెయ్.. ఎంజాయ్ చెయ్.. కానీ కండోమ్ యూజ్ చెయ్.. హీరోయిన్ సంచలనం

attack | indian-student | australia | today-latest-news-in-telugu

Advertisment
తాజా కథనాలు