/rtv/media/media_files/2025/02/05/kRBXm9fYbaG73FtCG1GH.jpg)
trump green land
గ్రీన్ ల్యాండ్ పై ట్రంప్ కన్ను పడటంతో ఆ దేశం పూర్తిగా అప్రమత్తమైంది. తమ దేశంలోని రాజకీయ పార్టీలు విదేశాల నుంచి నిధులు స్వీకరించకుండా నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బిల్లును అక్కడి చట్ట సభ ఆమోదించింది. తాజా నిర్ణయంతో స్థానిక రాజకీయ పార్టీల సమగ్రతను కాపాడుకొనే అవకాశం ఉందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.
Also Read: MP Pappu Yadav: రాజకీయ నాయకులు కుంభమేళాలో చనిపోవాలి
ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. గ్రీన్ ల్యాండ్ ను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా ఆసక్తి చూపిస్తుండటమే ఈ బిల్లు తీసుకురావడానికి ప్రధాన కారణం. మార్చి 11 వ తేదీన ఇక్కడ సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తామని ఆ దేశ ప్రధాని తాజాగా ఫేస్‌బుక్ పోస్టులో ప్రకటించారు. ఈసారి ఎన్నికల్లో స్వాతంత్య్రం అంశం కూడా ప్రధాన అంశం అయ్యే అవకాశాలున్నాయి.
Also Read: Trump: గాజాను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ హెచ్చరికలు!
ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ,డెన్మార్క్ తో సంబంధాలు బలహీనం కావడం వంటి అంశాలున్నాయి. మనం ఇప్పుడు తీవ్రమైన గడ్డుకాలం ఎదుర్కొంటున్నాం. గతంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదు. అంతర్గత విభేదాలకు ఇది సమయం కాదు అని గ్రీన్ ల్యాండ్ ప్రధాన మ్యూట్ ఎగేడ్ వెల్లడించారు. 2016లో అధ్యక్షుడిగా ఉన్న వేళ కూడా ఈ ప్రతిపాదన రాగా నాడు డెన్మార్క్ తిరస్కరించింది.
ఇటీవల ఆ దేశానికి అమెరికా రాయబారిగా కెన్ హౌరీని నియమించిన వేళ...ట్రంప్ తన మనసులో మాటను బయట పెట్టారు. జాతీయ భద్రత, ప్రపంచంలో స్వేచ్ఛను కాపాడటానికి గ్రీన్ ల్యాండ్ పై యాజమాన్యం ఉండటం చాలా కీలకమని అమెరికా భావిస్తోందని నాడు ట్రూత్ లో పోస్ట్ చేశారు.
ఆ తర్వాత డెన్మార్క్ ప్రధాని ఫెడ్రిక్సన్ తో జరిగిన ఫోన్ కాల్లో ట్రంప్ గ్రీన్ ల్యాండ్ స్వాధీనం పైగట్టిగా మాట్లాడారు. ఖనిజాలు నిక్షిప్తమైన ప్రాంతంగా గ్రీన్ ల్యాండ్ కు పేరుంది. ప్రపంచంలోని 13శాతం చమురు..30 శాతం గుర్తించని గ్యాస్ నిల్వలున్నట్లు భావిస్తున్న ఆర్కిటిక్ లో ఇది భాగం. అతి తక్కువ జనావాసం ఉన్న ఈ ప్రాంతంలో ట్రంప్ రియల్ ఎస్టేట్ వెంచర్లు చేపట్టాలని భావించినట్లు కూడా చెబుతుంటారు.
21లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీరణం ఉన్న ఈ ప్రాంతంలో కేవలం 56,500 మంది మాత్రమే జీవిస్తున్నారు. 75 శాతం భూభాగం ఎప్పుడూ మంచు కిందే ఉంటుంది.
Also Read: Summer Effect: భగభగమంటున్న భానుడు..రానున్న 15 రోజులు జర జాగ్రత్త.. అధికారుల హెచ్చరికలు!
Also Read: Kumbh Mela 2025: మహాకుంభమేళాకు చేరుకున్న మోదీ... త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం