/rtv/media/media_files/2025/02/05/FDnxOjGoWMMmGLkrpeXh.jpg)
pappu
ఉత్తర్‌ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ వేదికగా జరుగుతోన్న కుంభమేళాలో చనిపోతే మోక్షం లభిస్తోందని బిహార్ స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుంభమేళాకు హాజరవుతున్న రాజకీయ నాయకులు, ధనవంతులు అక్కడే చనిపోవాలన్నారు. ఎందుకంటే అక్కడ ప్రాణాలు పోయిన వారికి మోక్షం లభిస్తుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
మోక్షం పొందారని...
త్రివేణి సంగమం ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో అనధికారిక లెక్కల ప్రకారం సుమారు 600 మంది వరకు చనిపోయారని ఆయన ఆరోపించారు. కనీసం వారికి ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో చనిపోయిన వారు మోక్షం పొందారని ఒక బాబా చెప్పారని.. సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ఉదేశించి పప్పు యాదవ్ కామెంట్ చేశారు.కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా లో గత నెల 30 తొక్కిసలాట ఘటన చోటుచేసుకుంది.
మౌని అమావాస్య సందర్భంగా విపరీతమైన రద్దీ నెలకొనడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మొత్తం 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మందికి పైగా గాయాలు అయ్యాయి. మౌని అమావాస్య ను పురస్కరించుకుని పుణ్య స్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సెక్టార్-2 ప్రాంతంలో భక్తుల తాకిడి విపరీతంగా ఉండటంతో బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది.
తొక్కిసలాటలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
Also Read: Summer Effect: భగభగమంటున్న భానుడు..రానున్న 15 రోజులు జర జాగ్రత్త.. అధికారుల హెచ్చరికలు!
Also Read: Delhi Assembly election 2025 : బిగ్ షాక్.. సీఎం అతిషి ఆఫీసర్ నుంచి రూ.5 లక్షలు స్వాధీనం!