/rtv/media/media_files/2025/01/31/2uoCwwor1Z9GFQ62NhzK.jpg)
Donald Trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. యుద్ధంతో దెబ్బతిన్న పాలస్తీనా భూభాగమైన గాజా స్ట్రిప్‌ను తమ దేశం స్వాధీనం చేసుకోవాలని భావిస్తుందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్, గాజాలో పరిస్థితులపై చర్చించారు.
Also Read: Delhi Assembly election 2025 : బిగ్ షాక్.. సీఎం అతిషి ఆఫీసర్ నుంచి రూ.5 లక్షలు స్వాధీనం!
అనంతరం ట్రంప్, నెతన్యాహు సంయుక్తంగా విలేకరుల సమాశంలో మాట్లాడారు. పాలస్తీనియన్లు వేరే చోట స్థిరపడిన తర్వాత తమ దేశం గాజా స్ట్రిప్‌ను స్వాధీనం చేసుకుంటుందని అన్నారు. గాజా స్ట్రిప్‌ను అభివృద్ధి చేస్తుందని, దానిని సొంతం చేసుకుంటుందని కూడా అన్నారు. ‘గాజా స్ట్రిప్‌ను అమెరికా స్వాధీనం చేసుకుంటుంది. గాజా స్ట్రిప్‌ను సొంతం చేసుకుని.. ఆ ప్రదేశంలో ఉన్న ప్రమాదకరమైన పేలని బాంబులు, ఇతర ఆయుధాలన్నింటినీ కూల్చివేసే బాధ్యతను తీసుకుంటాం. ఆ ప్రాంతాన్ని చదును చేస్తాం. మేము ధ్వంసమైన భవనాలను నేలమట్టం చేస్తాం.
ఆ ప్రాంత ప్రజలకు అపరిమిత సంఖ్యలో ఉద్యోగాలు, గృహాలను అందజేసే ఆర్థిక అభివృద్ధిని సృష్టిస్తాం’’ అని ట్రంప్ అన్నారు.ఆ ప్రాంతంలో దళాలను మోహరించే అవకాశం గురించి అడిగినప్పుడు.. ‘‘మేము అవసరమైనది చేస్తాం. అవసరమైతే, దానిని అభివృద్ధి చేస్తాం.. వేలాది ఉద్యోగాలను సృష్టిస్తాం..ఇది మొత్తం మధ్యప్రాచ్యం చాలా గర్వించదగినది అవుతుంది’’ అని ట్రంప్ సమాధానమిచ్చారు.
తన అభివృద్ధి ప్రణాళిక తర్వాత గాజాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు నివసించడాన్ని తాను ఊహించానని ట్రంప్ చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో మిడిల్ ఈస్ట్ పర్యటన సందర్భంగా గాజా, ఇజ్రాయెల్, సౌదీ అరేబియాను సందర్శించాలని యోచిస్తున్నానని ట్రంప్ అన్నారు.
చరిత్రను మార్చగల...
అయితే ట్రంప్ ఆలోచనను ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రశంసించారు. అదే విలేకరుల సమావేశంలో నెతన్యాహు మాట్లాడుతూ.. ఇది చరిత్రను మార్చగల నిర్ణయమని పేర్కొన్నారు.
ట్రంప్.. గాజాకు భిన్నమైన భవిష్యత్తును ఊహించారని పేర్కొన్నారు. ట్రంప్‌ను ‘‘వైట్ హౌస్‌లో ఇజ్రాయెల్‌కు ఉన్న గొప్ప స్నేహితుడు’’ అని నెతన్యాహు అన్నారు. ట్రంప్ చర్యలు యూదు రాజ్యం, యూదు ప్రజలకు ఆయన స్నేహం, మద్దతుకు నిదర్శనంగా నిలుస్తాయని అన్నారు.అందుకే ఇజ్రాయెల్ ప్రజలకు ట్రంప్ పట్ల అపారమైన గౌరవం ఉందని చెప్పారు.
ఇక, 2023 అక్టోబర్ నుంచి ఇటీవలి కాల్పుల విరమణ ఒప్పందం వరకు ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్‌ల మధ్య యుద్దంతో గాజాలో తీవ్ర రక్తపాతం జరిగిన విషయం తెలిసిందే. బాంబు దాడులతో నిత్యం అట్టుడికింది. ఇజ్రాయెల్ బాంబు దాడులు గాజా స్ట్రిప్‌లోని చాలా నిర్మాణాలను ధ్వంసం చేశాయి. దీంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
Also Read: Horoscope Today: నేడు ఈ రాశి వారు ఉద్యోగ రంగంలో ముందుకు దూసుకుపోతారు!