China: 'పిల్లల్ని కనండి ప్లీజ్..' మహిళలను బుజ్జగిస్తోన్న చైనా అధ్యక్షుడు!
చైనాలో జననాల కంటే మరణాలు పెరుగుతున్న విషయం తెలిసిందే. 1961తర్వాత తొలిసారి జనాభా తగ్గుదలను చవిచూసిన చైనా పిల్లల్ని కనండి మహాప్రభో అని మొత్తుకుంటోంది. దేశ జనాభాలో యువత శాతం తగ్గిపోవడమే దీనికి కారణం. సాక్ష్యాత్తు దేశ అధ్యక్షుడు జిన్పింగే మహిళలకు కీలక సూచనలు చేశారంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కుటుంబ సామరస్యం బట్టి మహిళల ఎదుగుదలను చూడాలంటూ జిన్పింగ్ కామెంట్స్ చేశారు.