/rtv/media/media_files/2025/08/01/gang-attack-on-indians-in-ireland-sparks-embassy-advisory-2025-08-01-21-14-41.jpg)
Gang attack on Indians in Ireland sparks embassy advisory
ఐర్లాండ్‌లో భారతీయ పౌరులపై ఇటీవల భౌతిక దాడులు జరగడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి భారతీయుల భద్రకు సంబంధించి అక్కడి రాయబార కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది. ప్రతికూల పరిస్థితుల్లో ఎవరూ లేని ప్రదేశాలకు వెళ్లకూడదని.. ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే ముందస్తుగా భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఐర్లాండ్‌లో భారతీయులపై భౌతిక దాడులు జరిపాయి. ఇలాంటి కేసులో రోజురోజుకి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే ఐర్లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది.
Also Read: 'బీజేపీ కోసం ఈసీ ఓట్ల చోరీ.. ఆటమ్ బాంబ్ లాంటి ఆధారాలున్నాయ్': రాహుల్ గాంధీ
అక్కడి అధికారులతో సంప్రదింపులు కూడా జరుపుతోంది. అయితే భారతీయులు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని సూచించింది. నిర్జన ప్రదేశాలకు వెళ్లకూడదని సూచనలు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని చెప్పింది. ఇందుకోసం 0899423734 ఫోన్ నెంబర్‌కు, [email protected] మెయిల్ ఐడీకి సమాచారం అందించాలని సూచించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జులై 19న ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ శివారులోని తల్లాగ్డ్‌లో డా. సంతోష్ యాదవ్ అనే భారత పౌరుడిపై పలువురు స్థానిక యువకులు జాత్యాహంకార దాడికి పాల్పడ్డారు. దూషించారు.
Also Read: రేపే పీఎం కిసాన్.. ఈ పని చేయకపోతే డబ్బులు రావు.. అన్నదాతలకు అలర్ట్!
సంతోష్ యాదవ్ ఛాతీ, కాళ్లు, చేతులపై పిడిగుద్దులు గుద్దారు. రక్తం వచ్చేవరకు కొట్టారు. చివరికి సంతోష్ మెల్కొని పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అయితే తనకు ఎదురైన అనుభవాన్ని సంతోష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది. అయితే స్థానికంగా బస్సులు, నివాస ప్రాంతాలు, వీధుల్లో ఇలాంటి జాత్యాహంకార దాడులు ఎక్కువగా జరిగినట్లు ఆవేదన చెందాడు. చివరికి ఈ దాడి ఘటనపై ఐర్లాండ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
Also Read: పాక్, బంగ్లాపై ట్రంప్ టారిఫ్ మినహాయింపు.. భారత్‌పై అమెరికా కుట్ర!
ఈ ఘటనపై భారత రాయబారి అఖిలేశ్ మిశ్రా స్పందించారు. ఈ ఘటన షాక్‌కు గురిచేసిందని.. బాధితుడి కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నామని చెప్పారు. అలాగే అవసరమైన సాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. అయితే ఈ దాడిని ఖండిస్తూ అక్కడ ఆందోళనలు కూడా జరిగాయి. విదేశీ పౌరులపై ఐర్లాండ్‌లో జరుగుతున్న దాడులపై అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల డబ్లిన్‌కు వచ్చిన ఓ భారతీయ ఉద్యోగిపై కూడా కొందరు స్థానిక యువకులు దాడి చేశారు. అతడి బట్టలు విప్పేసి తీవ్రంగా కొట్టారు. అతడి వద్ద ఉన్న వస్తువులను కూడా దోచుకున్నారు. ఇలా ఐర్లాండ్‌లో భారతీయులపై దాడులు జరగడం ఆందోళన రేపుతోంది.